Breaking News

హ్యారీ బ్రూక్‌ సూపర్‌ సెంచరీ.. తొలి రోజు ఇంగ్లండ్‌దే

Published on Fri, 12/06/2024 - 14:06

టెస్టు క్రికెట్‌లో ఇంగ్లండ్‌ స్టార్‌ బ్యాటర్‌ హ్యారీ బ్రూక్‌ తన సూపర్‌ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో అద్భుతమైన సెంచరీతో చెలరేగిన బ్రూక్‌.. ఇప్పుడు రెండో టెస్టులో కూడా దమ్ములేపాడు.

క్రైస్ట్‌ చర్చ్‌ వేదికగా జరుగుతున్న సెకెండ్‌ టెస్టులో బ్రూక్‌ సూపర్‌ సెంచరీతో మెరిశాడు. వన్డే తరహాలో తన ఇన్నింగ్స్‌ను కొనసాగించిన బ్రూక్‌ కేవలం 91 పరుగుల్లోనే తన 8వ టెస్టు సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.

ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 115 బంతులు ఎదుర్కొన్న బ్రూక్‌.. 11 ఫోర్లు, 5 సిక్స్‌లతో 123 పరుగులు చేసి రనౌటయ్యాడు. ఇక అతడి అద్భుత ప్రదర్శన ఫలితంగా ఇంగ్లండ్‌ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 280 పరుగులకు ఆలౌటైంది.

ఇంగ్లండ్‌ అతడితో పాటు ఓలీ పోప్‌(66) హాఫ్‌ సెంచరీతో రాణించాడు. కివీస్‌ బౌలర్లలో నాథన్‌ స్మిత్‌ నాలుగు వికెట్లు పడగొట్టగా.. విలియం​ ఓ రూర్క్‌ 3, మాట్‌ హెన్రీ రెండు వికెట్లు సాధించారు.

అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన న్యూజిలాండ్‌కు ఇంగ్లండ్‌ బౌలర్లు చుక్కలు చూపిస్తున్నారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి కివీస్‌ 5 వికెట్ల నష్టానికి 86 పరుగులు చేసింది. కివీస్‌ ప్రస్తుతం 194 పరుగుల వెనకంజలో ఉంది. ఇంగ్లండ్‌ బౌలర్లలో బ్రైడన్‌ కార్సే రెండు వికెట్లు సాధించగా.. వోక్స్‌, అట్కిన్సన్‌, స్టోక్స్‌ తలా వికెట్‌ పడగొట్టారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)