Breaking News

జైస్వాల్‌ను వెనక్కు నెట్టి రెండో స్థానానికి ఎగబాకిన హ్యారీ బ్రూక్‌

Published on Wed, 12/04/2024 - 15:12

ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్‌ బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్‌ స్టార్‌ ఆటగాడు హ్యారీ బ్రూక్‌ రెండో స్థానానికి ఎగబాకాడు. బ్రూక్‌.. టీమిండియా యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ను వెనక్కు నెట్టి ఈ స్థానానికి చేరుకున్నాడు. గడిచిన వారంలో బ్రూక్‌, జైస్వాల్‌ ఇద్దరూ మంచి ప్రదర్శనలే చేసినప్పటికీ.. ర్యాంకింగ్స్‌లో మాత్రం బ్రూక్‌ ముందుకెళ్లాడు. 

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్‌లో యశస్వి 161 పరుగుల ఇన్నింగ్స్‌ ఆడగా.. న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో బ్రూక్‌ 171 పరుగుల ఇన్నింగ్స్‌ ఆడాడు. తాజా ర్యాంకింగ్స్‌లో యశస్వి ర్యాంక్‌ దిగజారినప్పటికీ అతని రేటింగ్‌ పాయింట్లు మాత్రం మెరుగుపడ్డాయి.

మరోవైపు ఆస్ట్రేలియాతోనే జరిగిన తొలి టెస్ట్‌ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లి సైతం సెంచరీ చేసినప్పటికీ ఓ ర్యాంక్‌ కోల్పోయి 14వ స్థానానికి పడిపోయాడు. శ్రీలంకతో జరిగిన తొలి టెస్ట్‌ మ్యాచ్‌లో సెంచరీ, ఓ హాఫ్‌ సెంచరీ చేసిన సౌతాఫ్రికా ఆటగాడు టెంబా బవుమా ఏకంగా 14 స్థానాలు మెరుగపర్చుకుని 10వ స్థానానికి చేరుకున్నాడు. 

ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ జో రూట్‌ అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా.. న్యూజిలాండ్‌ మాజీ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. లంక ఆటగాడు కమిందు మెండిస్‌ రెండు స్థానాలు మెరుగుపర్చుకుని ఏడో స్థానానికి చేరుకోగా.. భారత్‌ తరఫున రిషబ్‌ పంత్‌ ఆరో నంబర్‌ ఆటగాడిగా కొనసాగుతున్నాడు.

బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌ విషయానికొస్తే.. టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్‌ బుమ్రా టాప్‌ ప్లేస్‌లో కొనసాగుతుండగా.. రబాడ, హాజిల్‌వుడ్‌, అశ్విన్‌ టాప్‌-4లో ఉన్నారు. తాజా ర్యాంకింగ్స్‌లో కమిన్స్‌, రవీంద్ర జడేజా, నాథన్‌ లయోన్‌ తలో స్థానం మెరుగుపర్చుకుని 5, 6, 7 స్థానాలకు చేరుకోగా.. దక్షిణాఫ్రికా పేసర్‌ మార్కో జన్సెన్‌ ఏకంగా 19 స్థానాలు మెరుగుపర్చుకుని 9వ స్థానానికి ఎగబాకాడు. 

జన్సెన్‌ ఇటీవల శ్రీలంకతో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో 10 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. టెస్ట్‌ ఆల్‌రౌండర్ల విషయానికొస్తే.. రవీంద్ర జడేజా టాప్‌లో కొనసాగుతుండగా.. జన్సెన్‌ 10 స్థానాలు మెరుగుపర్చుకుని రెండో స్థానానికి ఎగబాకాడు. అశ్విన్‌ మూడో స్థానానికి పడిపోయాడు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)