Breaking News

అంతా బాగానే ఉంది.. ఆ బలహీనతను అధిగమిస్తే తిరుగుండదు

Published on Fri, 04/14/2023 - 23:08

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో హ్యారీ బ్రూక్‌ సెంచరీ సాధించి చరిత్ర సృష్టించాడు. ఈ సీజన్‌లో తొలి సెంచరీ నమోదు చేయడంతో పాటు డెబ్యూ ఐపీఎల్‌ ఆడుతున్న బ్రూక్‌కు  ఇదే తొలి సెంచరీ. 55 బంతుల్లో 12 ఫోర్లు, మూడు సిక్సర్లతో సెంచరీ మార్క్‌ అందుకున్న హ్యారీ బ్రూక్‌ ఆటపై అన్నివైపుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. 

సెంచరీ మాట అటుంచితే ఒక్క విషయంలో మాత్రం బ్రూక్‌ వెనుకబడ్డాడు. కేకేఆర్‌తో మ్యాచ్‌లో స్పిన్‌ ఆడడంలో తెగ ఇబ్బంది పడ్డాడు. పేస్‌ బౌలర్లను ఉతికారేసిన బ్రూక్‌  స్పిన్నర్ల బౌలింగ్‌లో మాత్రం కాస్త స్లోగా ఆడాడు. పేసర్ల బౌలింగ్‌లో అతని స్ట్రైక్‌రేట్‌ 258 ఉంటే.. స్పిన్నర్ల బౌలింగ్‌లో అతని స్ట్రైక్‌రేట్‌ 117గా ఉండడం గమనార్హం. ఒకవేళ వచ్చే మ్యాచ్‌ల్లో బ్రూక్‌ స్పిన్‌ ఆడడంపై దృష్టి పెడితే అతనికి తిరుగుండదు. ఎలాగూ పేసర్ల బౌలింగ్‌ను చీల్చిచెండాడుతున్నాడు. 

ఇక హ్యారీ బ్రూక్‌కు ఇదే తొలి ఐపీఎల్‌ సీజన్‌. టెస్టు మ్యాచ్‌ల్లో మంచి రికార్డు ఉన్నప్పటికి ఒక్కసారి కుదురుకున్నాడంటే ఔట్‌ చేయడం చాలా కష్టం. పరిస్థితులు అలవాటు పడేవరకు ఏ క్రికెటర్‌కైనా పరుగులు చేయడం కాస్త ఇబ్బందే. హ్యారీ బ్రూక్‌ ఆ ఫేజ్‌ను అనుభవించాడు. ప్రస్తుతం దాని నుంచి బయటపడ్డాడు. ఫలితం.. కేకేఆర్‌తో మ్యాచ్‌లో ఏకంగా సెంచరీతో మెరిసి విమర్శకుల నోళ్లు మూయించాడు.

చదవండి: 'గర్ల్‌ఫ్రెండ్‌ మాత్రమే ఇక్కడుంది.. అందరూ వెళ్లిపోయారు'

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)