అందుకే ఓడిపోయాం.. ఎప్పటికీ మర్చిపోలేం: భారత కెప్టెన్‌

Published on Mon, 07/29/2024 - 17:58

మహిళల ఆసియా టీ20 కప్‌-2024 టోర్నీ ఫైనల్లో తాము స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయామని టీమిండియా కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ విచారం వ్యక్తం చేసింది. అసలైన పోరులో అనవసర తప్పిదాలతో టైటిల్‌ చేజార్చుకున్నామని పేర్కొంది. ఏదేమైనా శ్రీలంక మహిళా జట్టు గత కొన్నాళ్లుగా అద్భుతంగా ఆడుతోందని.. వాళ్లకు ఈ విషయంలో క్రెడిట్‌ ఇవ్వాల్సిందేనని ప్రశంసించింది.

భారత మహిళల జైత్రయాత్రకు ఫైనల్లో బ్రేక్‌ పడిన విషయం తెలిసిందే. ఎనిమిదోసారి ఆసియా కప్‌ టైటిల్‌ గెలుస్తుందనుకున్న జట్టును ఆతిథ్య శ్రీలంక గట్టి దెబ్బ  కొట్టింది. అన్ని మ్యాచ్‌ల్లో గెలిచిన భారత్‌ను అసలైన ఫైనల్లో శ్రీలంక ఓడించి తొలిసారి ఆసియా కప్‌ను ముద్దాడింది.

డంబుల్లా వేదికగా ఆదివారం జరిగిన ఆసియా కప్‌ టీ20 టోర్నీ ఫైనల్లో హర్మన్‌ప్రీత్‌ బృందంపై శ్రీలంక 8 వికెట్ల తేడాతో విజయఢంకా మోగించింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది.

అందుకే ఓడిపోయాం
స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన (47 బంతుల్లో 60; 10 ఫోర్లు) రాణించగా, రిచా ఘోష్‌ (14 బంతుల్లో 30; 4 ఫోర్లు, 1 సిక్స్‌) ఆఖర్లో మెరిపించింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన శ్రీలంక 18.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసి జయభేరి మోగించింది. కెప్టెన్‌ చమరి అటపట్టు (43 బంతుల్లో 61; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), హర్షిత (51 బంతుల్లో 69; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీలతో గెలిపించారు.

ఈ నేపథ్యంలో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ స్పందిస్తూ.. ‘‘ఈ టోర్నీ ఆసాంతం మేము బాగా ఆడాం. అయితే, ఫైనల్లో పొరపాట్లకు తావిచ్చాం. నిజానికి మేము మెరుగైన స్కోరే సాధించాం. అయితే, శ్రీలంక అద్భుతంగా బ్యాటింగ్‌ చేసింది. లంక బ్యాటర్లు మా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. మేము ఇంకా మెరుగ్గా ఆడాల్సింది. ఈరోజును ఎన్నటికీ మర్చిపోలేం. ఏదేమైనా శ్రీలంక అద్భుతంగా ఆడింది. వాళ్లకు కంగ్రాట్స్‌’’ అంటూ విష్‌ చేసింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)