Breaking News

మా ఓటమికి కారణమదే.. చాలా బాధగా ఉంది: టీమిండియా కెప్టెన్‌

Published on Mon, 10/20/2025 - 10:10

ఐసీసీ మహిళల ప్రపంచకప్‌-2025లో భారత జట్టు ఓటముల పరంపర కొనసాగుతోంది. ఆదివారం ఇండోర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగు పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 289 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో చివరి ఓవర్లలో తడబడిన భారత జట్టు.. ఈజీగా గెలవాల్సిన మ్యాచ్‌ను చేజార్చుకుంది.

ఇది భారత్‌కు వరుసగా మూడో ఓటమి. ఈ ఓటమితో భారత్‌ సెమీఫైనల్‌ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఇక మిగిలిన రెండు మ్యాచ్‌లను గెలిస్తేనే మన అమ్మాయిల జట్టు నేరుగా సెమీఫైనల్స్‌కు ఆర్హత సాధించనుంది. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్ స్పందించింది. స్మృతి మంధాన వికెట్‌తో మ్యాచ్ ఇంగ్లండ్ వైపు టర్న్ అయిందని హర్మన్ చెప్పుకొచ్చింది.

"గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడిపోయినందుకు చాలా బాధగా ఉంది. స్మృతీ మంధాన వికెట్‌తో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. అప్పటివరకు మేము గేమ్‌లో ఉన్నాము. ఈజీగా గెలుస్తామనుకున్నాము. మంధాన వికెట్ పడిన తర్వాతే మేము పట్టు కోల్పోయాము. కానీ ఇంగ్లండ్ బౌలర్లకు కూడా క్రెడిట్ ఇవ్వాలి.

వారు ఆఖరి వరకు అద్భుతంగా బౌలింగ్ చేసి మాపై ఒత్తడి పెంచారు. వరుస క్రమంలో వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను మా నుంచి లాగేసుకున్నారు. ఈ మ్యాచ్‌లో మేము  అన్ని విభాగాల్లో మెరుగైన ప్రదర్శన కనబరిచాము. ప్ర‌తీది మేము అనుకున్న‌ట్లు సాగింది. కానీ చివ‌రి ఐదు-ఆరు ఓవ‌ర్ల‌లో విఫ‌ల‌మ‌య్యాము. 

నిజంగా మాకు ఇది హార్ట్ బ్రేకింగ్ మూమెంట్‌. గత ‍కొంతకాలంగా మా బ్రాండ్ ఆఫ్ క్రికెట్‌ను కొన‌సాగిస్తున్నాము. కానీ దుర‌దృష్టవశాత్తూ ఓడిపోతున్నాము. మాకు తదుపరి మ్యాచ్ చాలా కీలకం. ఈ మ్యాచ్‌లో మెరుగైన ప్రదర్శన కనబరిచి విజయం సాధిస్తాము అని ఆశిస్తున్నాను.

ఈ మ్యాచ్‌లో బౌలర్లు కూడా మెరుగ్గా రాణించారు. నాట్ స్కీవర్‌, హీథర్ క్రీజులో ఉన్నప్పుడు ఇంగ్లండ్ భారీ స్కోర్ చేస్తుందని భావించాము. కానీ మా బౌలర్లు కమ్‌బ్యాక్ ఇచ్చి వారిని 300 పరుగులలోపు కట్టడి చేశారు. కానీ బౌలింగ్‌లో కూడా చివరి ఐదు ఓవర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నాము. మేము ఈ విషయంపై డ్రెస్సింగ్ రూమ్‌లో చర్చించుకుంటున్నాము. 

ఈ మ్యాచ్‌లో అద‌న‌పు బౌల‌ర్‌తో ఆడాల‌నుకున్నాము. అందుకే జెమిమా స్దానంలో రేణుకాను ఆడించాల‌నుకున్నాము. స్మ‌తి, నేనూ కీలక భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పాము. ఆ త‌ర్వాత రిచా, అమ‌న్ జోత్‌, దీప్తి లాంటి ప్లేయ‌రర్లు ఉండ‌డంతో ఈజీగా గెలుస్తామ‌నుకున్నాము. ఏదేమైన‌ప్ప‌టికి ఈరోజు అదృష్టం మా వైపు లేదు. త‌ర్వాత మ్యాచ్‌లో తిరిగి పుంజుకుంటామ‌న్న న‌మ్మ‌కం ఉంది అని హ‌ర్మ‌న్ పేర్కొంది.
చదవండి: నితీశ్‌ రెడ్డిని అందుకే తీసుకున్నారు.. కానీ ఇదేం పద్ధతి?: అశూ ఫైర్‌
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)