Breaking News

చరిత్ర సృష్టించిన టీమిండియా కెప్టెన్‌.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా

Published on Sun, 06/21/2026 - 21:54

భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ మ‌రో అరుదైన రికార్డును త‌న పేరిట లిఖించుకుంది. పురుషుల, మహిళల క్రికెట్ చరిత్రలోనే 200 అంత‌ర్జాతీయ‌ టీ20 మ్యాచ్‌లు ఆడిన మొట్టమొదటి ప్లేయర్‌గా హర్మన్‌ప్రీత్ రికార్డులకెక్కింది.

ఉమెన్స్ టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026లో భాగంగా సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో బ‌రిలోకి దిగడంతో హర్మన్ ఈ ఘనతను సొంతం చేసుకుంది. 2009లో ఇంగ్లండ్ వేదిక‌గా జరిగిన తొలి మహిళల టీ20 ప్రపంచకప్‌తో అంత‌ర్జాతీయ అరంగేట్రం చేసిన హ‌ర్మ‌న్‌.. త‌న‌ 17 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఇప్ప‌టివ‌ర‌కు రెండు వందల టీ20 మ్యాచ్‌ల‌లో భార‌త్‌కు ప్రాతినిథ్యం వ‌హించింది. హర్మన్‌కు ఇది 10వ టీ20 వరల్డ్‌కప్‌ కావడం గమనార్హం.

కాగా మహిళల విభాగంలో అత్యధిక టీ20 మ్యాచ్‌లు ఆడిన జాబితాలో హర్మన్‌(200) అ‍గ్రస్ధానంలో ఉండగా.. రెండో స్ధానంలో న్యూజిలాండ్ లెజెండరీ ప్లేయర్‌  సూజీ బేట్స్ (184 మ్యాచ్‌లు) రెండో స్ధానంలో కొనసాగుతోంది. పురుషుల క్రికెట్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఐర్లాండ్ ఆటగాడు పాల్ స్టిర్లింగ్ (163) ఉన్నాడు.

అత్యధిక టీ20లు ఆడిన టాప్ ప్లేయర్స్
పురుషుల విభాగంలో: 
పాల్ స్టిర్లింగ్ (ఐర్లాండ్): 163 మ్యాచ్‌లు (అగ్రస్థానం)  
రోహిత్ శర్మ (భారత్): 159 మ్యాచ్‌లు (రెండో స్థానం)  

మహిళల విభాగంలో:
 హర్మన్‌ప్రీత్ కౌర్ (భారత్): 200 మ్యాచ్‌లు  
సూజీ బేట్స్ (న్యూజిలాండ్): 184 మ్యాచ్‌లు  
ఎలిస్ పెర్రీ (ఆస్ట్రేలియా): 177 మ్యాచ్‌లు

కాగా త‌న కెరీర్‌లో హ‌ర్మ‌న్ ఇప్ప‌టివ‌ర‌కు ఆడిన 200 మ్యాచ్‌ల‌లో 29.83 స‌గ‌టుతో 4147 ప‌రుగులు చేసింది. ఇందులో ఒక సెంచరీతో పాటు 17 అర్ధ సెంచరీలు ఉన్నాయి. టీ20ల్లో ఆమె అత్యధిక వ్యక్తిగత స్కోరు 103 పరుగులుగా ఉన్నాయి. బౌలింగ్‌లో ఆమె 32 వికెట్లు ప‌డ‌గొట్టింది.
 

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి