Breaking News

హర్మన్‌పై వేటు.. ఆసియా గేమ్స్‌లో జట్టును నడిపించేది ఎవరు?

Published on Wed, 07/26/2023 - 10:48

భారత మహిళల జట్టు రెగ్యులర్‌ కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌పై ఐసీసీ రెండు మ్యాచ్‌ల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో అంపైర్‌ నిర్ణయాన్ని తప్పుబట్టిన హర్మన్‌ సహనం కోల్పోయి బ్యాట్‌తో వికెట్లను విరగొట్టడం.. అంపైర్‌తో అనుచితంగా ప్రవర్తించడం ఐసీసీ తప్పుబట్టింది.

అనుచిత ప్రవర్తనకు గానూ హర్మన్‌ ఖాతాలో 4 డీమెరిట్‌ పాయింట్లు అంటే 2 సస్పెన్షన్‌ పాయింట్లతో సమానం. దాంతో రెండు మ్యాచ్‌ల నిషేధం పడింది. దీంతోపాటు ఆమె మ్యాచ్‌ ఫీజులో కూడా 75 శాతం కోత పడింది. ఐసీసీ లెవల్‌–2 నిబంధన ప్రకారం నిషేధానికి గురైన తొలి మహిళా క్రికెటర్‌ హర్మన్‌ కావడం గమనార్హం.   దీని ప్రకారం ఈ ఏడాది జరిగే ఆసియా క్రీడల్లో భారత్‌ ఆడే తొలి రెండు మ్యాచ్‌లకు హర్మన్‌ దూరం కానుంది.   

ఈ నేపథ్యంలో ఆసియా గేమ్స్‌లో టీమిండియా ఆడబోయే తొలి రెండు మ్యాచ్‌లకు వైస్‌కెప్టెన్‌ అయిన స్మృతి మంధాన జట్టును నడిపించనుంది. కాగా ఆసియా గేమ్స్‌ సెప్టెంబర్‌ 19 నుంచి అక్టోబర్‌ 8 వరకు చైనాలోని హాంగ్జూ పట్టణంలో జరగనున్నాయి. ఇక ర్యాంకింగ్స్‌ ఆధారంగా టీమిండియా మహిళల జట్టు నేరుగా ఆసియా గేమ్స్‌కు క్వాలిఫై అయింది. సెప్టెంబర్‌ 24న భారత మహిళల జట్టు తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది.

కాగా హర్మన్‌ తీరుపట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన ఐసీసీ.. అనుచిత ప్రవర్తనకు గానూ ఐసీసీ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ కింద ఆమెకు మూడు డీమెరిట్‌ పాయింట్లు శిక్షగా విధించగా, మ్యాచ్‌ ముగిసిన తర్వాత అంపైరింగ్‌ ప్రమాణాలు బాగా లేవంటూ విమర్శించింది. దీనిపై ఒక డీమెరిట్‌ పాయింట్‌ శిక్ష పడింది. అనంతరం వేదికపై బంగ్లాదేశ్‌ కెపె్టన్‌ నిగార్‌ సుల్తానాతో కలిసి ట్రోఫీ అందుకునే సమయంలో ‘మ్యాచ్‌ టై చేసింది అంపైర్లే తప్ప మీరు కాదు. ఫొటో దిగేందుకు వాళ్లనూ రమ్మనండి’ అంటూ బంగ్లాదేశ్‌ ఆటగాళ్లను ఉద్దేశించి చెప్పింది.

చదవండి: FIFA World Cup: ప్రపంచకప్‌లో ఆడిన అతిపిన్న వయస్కురాలిగా..

వరల్డ్‌ కప్‌లో భారత్‌-పాక్‌ మ్యాచ్‌ రీ షెడ్యూల్‌.. భద్రతా కారణాల దృష్ట్యా..!

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)