Breaking News

టీమిండియా నుంచి తీసేశారు.. క‌ట్ చేస్తే! వెస్టిండీస్‌లో?

Published on Sun, 09/13/2026 - 07:34

భారత మహిళల క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ హర్లీన్ డియోల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉమెన్స్ కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడేందుకు డియోల్ సిద్దమైంది. ఈ క్రమంలో డిఫెండింగ్ ఛాంపియన్ 'బార్బడోస్ రాయల్స్' జట్టుతో ఆమె ఒప్పందం కుదుర్చుకుంది. ఈ చండీగఢ్ క్రికెటర్ ఇప్పటికే  బార్బడోస్ చేరుకుంది.

కాగా  28 ఏళ్ల హర్లీన్ డియోల్ సీనియర్ భారత జట్టులో గానీ, 'ఇండియా ఎ' జట్టులో గానీ సభ్యురాలు కాకపోవడంతో ఈ టోర్నమెంట్ మొత్తానికి అందుబాటులో ఉండనుంది. ప్రస్తుతం జరుగుతున్న ఉమెన్స్ సీపీఎల్‌లో మొత్తం ఐదుగురు భారత మహిళా క్రికెటర్లు పాల్గొంటున్నారు.

హర్లీన్ డియోల్, కిరణ్ నవ్‌గిరే, పూజా వస్త్రాకర్‌లు బార్బడోస్ రాయల్స్‌లో భాగం కాగా.. శిఖా పాండే, యస్తికా భాటియా ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ తరపున ఆడుతున్నారు. డియోల్ భారత్ తరఫున 28 టీ20 మ్యాచ్‌లలో 92.01 స్ట్రైక్ రేట్‌తో 311 పరుగులు చేసింది. 

ఈ ఏడాది ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఆమె చివరిసారిగా టీమిండియాకు ప్రాతినిధ్యం వహించింది. అయితే డబ్ల్యూపీఎల్‌లో మంచి రికార్డు ఉన్న హర్లీన్, 28 మ్యాచ్‌లలో 649 పరుగులు సాధించింది.
చదవండి: యూఎస్‌ ఓపెన్‌ విజేతగా రైబాకినా

Videos

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

చంద్రబాబుపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్

అప్పిరెడ్డికి భద్రత కూడా కల్పించలేమన్న జైలు అధికారులు

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బర్త్ డే సెలెబ్రేషన్స్

రామాయణ రికార్డుల జాతర

రామాయణం చిత్రంపై రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర పోస్ట్

బంగారం కొనాలా? వద్దా? రానున్న 15 రోజుల్లో ఏం జరగబోతుందంటే?

జైల్లోలేళ్ల అప్పి రెడ్డిని పరామర్శించిన అంబటి రాంబాబు

YSRCP ఏజెంట్లపై TDP నేతల దాడి.. రమేష్ గౌడ్ పరామర్శ

అత్తను పెండ్లి చేసుకున్న అల్లుడు

Photos

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)

+5

19 ఏళ్లకొకసారే ఇలా.. మంజుల బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

శ్రీకాంత్ కూతురిని చూశారా? ఎలా మెరిసిపోతోందో? (ఫొటోలు)

+5

జపాన్‌లో అత్తమామలతో కలిసి రష్మిక సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

టాలీవుడ్ సెలబ్రిటీస్ ఇంట్లో సందడిగా దీపావళి వేడుకలు (ఫొటోలు)

+5

బర్త్ డే ప్లస్ దీపావళి.. ఫ్యామిలీతో అనసూయ సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దివాళి ఫొటోలు పంచుకున్న భూమిక, ప్రగ్యా జైస్వాల్ (ఫొటోలు)

+5

దివాళి వేళ.. అనుపమ (ఫోటోలు)

+5

జాన్వీ ప్లాన్ చేసిన ఖుషి కపూర్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)