Breaking News

పాకిస్తాన్‌ బౌలర్‌ ఓవరాక్షన్‌.. బుద్దిచెప్పిన హార్దిక్‌ పాండ్యా! వీడియో వైరల్‌

Published on Sun, 09/03/2023 - 07:58

భారత్‌-పాకిస్తాన్‌ మ్యాచ్‌ కోసం ఎంతో అతృతగా ఎదురుచూసిన అభిమానుల ఆశలపై వరుణుడు నీళ్లు చల్లింది. ఆసియాకప్‌-2023లో భారత్‌-పాకిస్తాన్‌ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైంది. భారత ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత భారీ వర్షం కురవడంతో పాకిస్తాన్ ఇన్నింగ్స్ మొదలవ్వలేదు. ఎప్పటికి వర్షం తగ్గుముఖం పట్టకపోవడంతో మ్యాచ్‌ని రద్దు చేస్తూ అంపైర్లు నిర్ణయం తీసుకున్నారు.

ఇరు జట్లకి చెరో పాయింట్ దక్కింది. దీంతో  సూపర్‌-4కు గ్రూపు-ఏ నుంచి పాకిస్తాన్‌ అర్హత సాధించింది. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 48.5 ఓవర్లలో 266 పరుగులకి ఆలౌట్ అయ్యింది. 66 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత్‌ను ఇషాన్‌ కిషన్‌, హార్దిక్‌ పాండ్యా అదుకున్నారు.

వీరిద్దరూ  ఐదో వికెట్‌కు 138 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. కిషన్‌ 82 పరుగులు చేయగా.. హార్దిక్‌ 87 పరుగులతో అదరగొట్టాడు. పాక్‌ బౌలర్లలో షాహీన్‌ షా అఫ్రిది నాలుగు వికెట్లతో అదరగొట్టగా.. హారీస్‌ రవూఫ్‌, నషీం షా తలా మూడు వికెట్లు సాధించారు.

హారీస్‌ రవూఫ్ ఓవరాక్షన్‌..
ఇక ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ స్టార్‌ పేసర్‌ హారీస్‌ రవూఫ్ ఓవరాక్షన్‌ చేశాడు. ఇషాన్‌ కిషన్‌న్‌ను ఔట్‌ చేసిన తర్వాత రౌఫ్‌ చేసిన సెలబ్రేషన్స్‌ శృతి మించాయి. భారత ఇన్నింగ్స్ 38వ ఓవర్ వేసిన రవూఫ్‌ బౌలింగ్‌లో కిషన్‌ భారీ షాట్‌కు ప్రయత్నించి బాబర్‌కు క్యాచి ఇచ్చి ఔటయ్యాడు. వెంటనే రవూఫ్‌.. కిషన్‌ వైపు వేలు చూపిస్తూ ఇక చాలు వెళ్లు వెళ్లు అంటూ సైగలు చేశాడు.

అయితే కిషన్‌ ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకుపోయినప్పటికీ.. మరో ఎండ్‌లో ఉన్న హార్దిక్‌ మాత్రం సీరియస్‌గా తీసుకున్నాడు. రవూఫ్‌ వేసిన తర్వాతి ఓవర్‌లో వరుసగా 3 ఫోర్లు బాది బ్యాట్‌తో సమాధానమిచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)