Breaking News

ఆసియాక‌ప్‌లో ఓవ‌రాక్ష‌న్‌.. పాక్ ఆట‌గాడిపై 2 మ్యాచ్‌ల బ్యాన్‌

Published on Tue, 11/04/2025 - 21:12

ఆసియాకప్‌-2025లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లలో ఓవరాక్షన్ చేసిన పాకిస్తాన్ స్పీడ్ స్టార్ హారిస్ రవూఫ్‌కు ఐసీసీ భారీ షాకిచ్చింది. రవూఫ్‌పై రెండు మ్యాచ్‌ల నిషేధాన్ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ విధించింది. ఈ మెగా టోర్నీలో రవూఫ్ రెండు సార్లు తమ ప్రవర్తనా నియమావళిని ఉల్లఘించినందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు ఐసీసీ ఓ ప్రకటనలో పేర్కొంది.

అస‌లేమి జ‌రిగింగ‌దంటే?
ఆసియాకప్‌లో భాగంగా లీగ్ స్టేజిలో సెప్టెంబర్ 14న భారత్‌-పాక్ జట్లు తలపడ్డాయి. అయితే ఈ మ్యాచ్‌లో భారత ఓపెనర్లు శుభ్‌మన్ గిల్‌, అభిషేక్ శర్మలను రవూఫ్ దుర్భాషలాడాడు. అంతేకాకుండా వారితో పాక్ పేసర్ వాగ్వాదానికి దిగాడు. దీంతో అతడి మ్యాచ్ ఫీజులో 30 శాతం జరిమానా ఐసీసీ విధించింది.

అదేవిధంగా రెండు  డిమెరిట్ పాయింట్లు కూడా అతడి ఖాతాలో చేరాయి. అయినా కూడా రవూఫ్ ప్రవర్తన ఏ మాత్రం మారలేదు. సూపర్‌-4 మ్యాచ్‌లో రవూఫ్ తన వక్రబుద్దిని చాటుకున్నాడు. ఫీల్డింగ్ చేస్తుండగా భారత అభిమానులు కోహ్లి కోహ్లి అని అరవగా..  అందుకు బదులుగా  రవూఫ్ భారత్‌కు చెందిన 6 రఫెల్ జెట్ ఫ్లైట్స్‌‌ను కూల్చామని, యుద్దంలో తమదే విజయమని పేర్కొంటూ 6-0 సంజ్ఞలు చేశాడు.

దీంతో మళ్లీ అతడి మ్యాచ్ ఫీజులో 30 శాతం కోతను ఐసీసీ విధించింది. మళ్లీ రెండు డిమెరిట్ పాయింట్లు ఇవ్వబడ్డాయి. మొత్తంగా అతడి ఖాతాలో నాలుగు డిమెరిట్ పాయింట్లు వచ్చి చేరాయి. అయితే 24 నెలల వ్యవధిలో 4 లేదా అంతకంటే ఎక్కువ డీమెరిట్ పాయింట్లు పొందితే..  ఐసీసీ సదరు ఆటగాడిపై ఒక టెస్ట్ మ్యాచ్ లేదా రెండు వన్డేలు లేదా రెండు టీ20ల నిషేధం విధిస్తుంది. ఈ కారణాంగానే ఫైసలాబాద్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేకు రవూఫ్ దూరమయ్యాడు.

సూర్యకు షాక్‌..
అదేవిధంగా లీగ్ స్టేజిలో పాకిస్తాన్‌పై సాధించిన విజయాన్ని ఫహల్గాం ఉగ్రదాడి బాధితులు, సైనికులకు అంకితమిస్తున్నట్లు ప్రకటించిన భారత కెప్టెన్ సూర్యకుమార్‌పై కూడా ఐసీసీ చర్యలు తీసుకుంది. సూర్యకుమార్ యాదవ్‌కు మ్యాచ్ ఫీజులో 30 శాతం జరిమానాతో పాటు రెండు  డీమెరిట్ పాయింట్లు కూడా విధించబడ్డాయి. సూర్య ఖాతాలో మరో రెండు డీమెరిట్ పాయింట్లు చేరితే 2 మ్యాచ్‌ల నిషేదం ఎదుర్కొక తప్పదు. అదేవిధంగా హ్యారిస్ రవూఫ్‌కు జెట్ విమానం కూలినట్లగా సైగ చేసిన జస్ప్రీత్ బుమ్రాను కూడా ఐసీసీ మందలించింది. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)