Breaking News

అ‍య్యో హార్దిక్‌.. దురదృష్ట​మంటే నీదే! అస్సలు అది ఔటా! వీడియో వైరల్‌

Published on Fri, 07/28/2023 - 10:02

బార్బోడస్‌ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో 5 వికెట్ల తేడాతో టీమిండియా విజయ భేరి మోగించిన సంగతి తెలిసిందే. 115 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్‌ 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా వైస్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యాను దురదృష్టం వెంటాడింది. ఊహించని రీతిలో హార్దిక్‌ రనౌటయ్యాడు.

ఏం జరిగిందంటే?
భారత ఇన్నింగ్స్‌ 14 ఓవర్‌ వేసిన విండీస్‌ స్పిన్నర్‌ యాన్నిక్ కరియా బౌలింగ్‌లో ఇషాన్‌ కిషన్‌ స్ట్రైట్‌గా ఆడాడు. ఈ క్రమంలో కార్నియా క్యాచ్‌ కోసం ప్రయత్నించి విఫలమయ్యాడు. అయితే బంతి అతడి  చేతుల్లోంచి బౌన్స్ అయి నేరుగా  నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో స్టంప్స్‌ను తాకింది. ఈ క్రమంలో నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌లో ఉన్న హార్దిక్‌ పాండ్యా కాస్త క్రీజు నుంచి ముందు ఉన్నట్లు అన్పించింది.

దీంతో ఫీల్డ్‌ అంపైర్‌ మైఖేల్ గోఫ్‌ థర్డ్‌ అంపైర్‌కు రిఫర్‌ చేశాడు. అయితే తొలుత రిప్లేలో హార్దిక్‌ క్రీజుకు చేరుకున్నప్పటికీ, బెయిల్స్‌ పడినప్పుడు మాత్రం బ్యాట్ గాలిలో ఉన్నట్లు కన్పించింది. పలు కోణాల్లో పరిశీలించిన థర్డ్‌ అంపైర్‌ పాండ్యాను రనౌట్‌గా ప్రకటించాడు. దీంతో 5 పరుగులు చేసిన హార్దిక్‌ నిరాశతో పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడయో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

అస్సలు పాండ్యాది ఔటా?
ఇక పాండ్యాపై రనౌట్‌పై బిన్నఅభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పాండ్యాది నౌటాట్‌ అంటూ నెటిజన్లు సోషల్‌ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఎందుకంటే ఐసీసీ కొత్త రూల్స్‌ ప్రకారం.. ఒక బ్యాటర్‌ పరుగు తీసే సమయంలో డైవ్ కొడుతూ బ్యాట్‌ను ముందుగా ఒకసారి గ్రౌండ్‌ను తాకి ఉంచితే చాలు.

ఆ తర్వాత అదే బ్యాట్ గాలిలో ఉంచినప్పటికీ తొలుత జరిగిన చర్యనే పరిగిణలోకి తీసుకోవాలి.  అంటే బ్యాట్‌ గాలిలో ఉండగా  స్టంప్ప్‌ను గిరాటేసినప్పటికీ..  బ్యాటర్‌ మందుగా క్రీజులో బ్యాట్‌ను ఉంచాడు కాబట్టి నాటౌట్‌గా ప్రకటించాలి. కానీ హార్దిక్‌ విషయంలో మాత్రం విండీస్‌కు ఫేవర్‌ థర్డ్‌ అంపైర్‌ నిర్ణయం తీసుకున్నాడు.
చదవండి: నేను అస్సలు ఊహించలేదు.. కానీ క్రెడిట్‌ మొత్తం వాళ్లకే! అతడు సూపర్‌: రోహిత్‌ శర్మ

Videos

టైగర్ షాఫ్ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)