Breaking News

అతడొక అత్యద్భుతం.. మేము అనుకున్న‌ది జ‌ర‌గలేదు: హార్దిక్‌

Published on Mon, 06/02/2025 - 08:25

ఐపీఎల్‌-2025 సీజ‌న్‌లో ముంబై ఇండియ‌న్స్ పోరాటం ముగిసింది. ఆదివారం పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన క్వాలిఫ‌య‌ర్‌-2లో 5 వికెట్ల తేడాతో ఓట‌మిపాలైన ముంబై ఇండియ‌న్స్‌.. ఈ టోర్నీ నుంచి ఇంటిముఖం ప‌ట్టింది. తొలుత బ్యాటింగ్‌లో అద‌ర‌గొట్టిన ముంబై, బౌలింగ్‌లో మాత్రం చేతులెత్తేసింది. ఆఖ‌రికి ఆ జ‌ట్టు ప్ర‌ధాన బౌల‌ర్ బుమ్రా సైతం తేలిపోయాడు. 204 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి  పంజాబ్ కింగ్స్ 5 వికెట్లు కోల్పోయి 19 ఓవ‌ర్ల‌లో చేధించింది. 

పంజాబ్ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అయ్య‌ర్ 41 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్‌ల‌తో 87 ప‌రుగులు చేసి త‌న జ‌ట్టును ఫైన‌ల్‌కు చేర్చాడు. అత‌డితో పాటు జోష్ ఇంగ్లిష్‌(38), వ‌ధేరా(48) కీల‌క ఇన్నింగ్స్‌లు ఆడారు. ముంబై బౌల‌ర్ల‌లో అశ్వినీ కుమార్ రెండు, బౌల్ట్‌, హార్దిక్ పాండ్యా త‌లా వికెట్ సాధించారు.

 బుమ్రా త‌న నాలుగు ఓవ‌ర్ల కోటాలో వికెట్ ఏమీ తీయ‌కుండా ఏకంగా 40 ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నాడు. ఇక ఈ ఓట‌మిపై మ్యాచ్ అనంత‌రం ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. బ్యాటింగ్‌లో రాణించినా, బౌలింగ్‌లో విఫ‌ల‌మ‌య్యామ‌ని హార్దిక్ అన్నాడు.

"శ్రేయ‌స్ అయ్య‌ర్ ఆసాధ‌ర‌ణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. అత‌డు ఆడిన షాట్లు అత్యద్భుతం. అయ్య‌ర్‌తో పాటు మిగిలిన బ్యాట‌ర్లు కూడా చాలా బాగా బ్యాటింగ్ చేశారు. మా ఇన్నింగ్స్ త‌ర్వాత ఈ టార్గెట్‌ను డిఫెండ్ చేసుకోవ‌చ్చు అని భావించామ‌. కానీ ఇటువంటి కీల‌క మ్యాచ్‌ల‌లో బౌలింగ్ యూనిట్ కూడా సమిష్టిగా రాణించ‌డం చాలా ముఖ్యం. 

ఈ మ్యాచ్‌లో మా బౌల‌ర్లు త‌మ ప్ర‌ణాళిక‌ల‌ను స‌రిగ్గా అమ‌లు చేయ‌లేక‌పోయారు. పంజాబ్ బ్యాట‌ర్లు చాలా ప్ర‌శాంతంగా కన్పించారు. వారు త‌మ అద్బుత బ్యాటింగ్‌తో మ‌మ్మ‌ల్ని ఒత్తిడిలోకి నెట్టారు. ఫ‌స్ట్ ఇన్నింగ్స్‌కు సెకెండ్ ఇన్నింగ్స్‌కు పిచ్‌లో పెద్ద‌గా మార్పులేదు. కొంచెం మంచు ప్ర‌భావం ఉన్న‌ప్ప‌ట‌కి దానిని మా ఓట‌మికి సాకుగా చెప్పాల‌నుకోవ‌డం లేదు. కెప్టెన్‌గా నేను కూడా అంత వ్యూహాత్మకంగా వ్యవహరించలేకపోయాను.

సరైన లెంగ్త్‌లో బౌలింగ్ చేయడం, సరైన సమయంలో సరైన బౌలర్‌ను ఉపయోగించడం వంటివి చేసుంటే ఫలితం భిన్నంగా ఉండేది. బుమ్రాను స‌రైన స‌మ‌యంలో బౌలింగ్ చేయించాని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే  17వ ఓవర్ వేయించి ఉంటే మరి తొందరయ్యేది.

ఆ స‌మ‌యంలో 4 ఓవ‌ర్ల‌లో పంజాబ్ విజ‌యానికి 41 ప‌రుగులు అవ‌స‌ర‌మ‌య్యాయి. ఆఖ‌రి మూడు ఓవ‌ర్ల‌లో బుమ్రాతో ఓవ‌ర్ వేయించాల‌ని మేము ప్లాన్ చేశాము. 18 బంతులు మిగిలిఉన్నప్ప‌టికి బుమ్రా త‌న అనుభ‌వంతో ప్రత్యేకంగా ఏదైనా చేయగలడు అని భావించాము. 

కానీ దురదృష్టవశాత్తు  మేము అనుకున్న‌ది ఈ రోజు జ‌ర‌గ‌లేదు" అని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేష‌న్‌లో పాండ్యా పేర్కొన్నాడు. ఇక మంగ‌ళ‌వారం అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న తుది పోరులో పంజాబ్ కింగ్స్‌, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు త‌ల‌ప‌డ‌నున్నాయి.

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)