Breaking News

హార్దిక్‌కు ఫిట్‌నెస్ టెస్ట్‌.. ఐపీఎల్‌కు దూరం కానున్నాడా!

Published on Tue, 03/15/2022 - 16:19

టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గత కొంత కాలంగా ఫిట్‌నెస్‌ సమస్యలతో జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. అయితే అతడు బ్యాటింగ్, ఫీల్డింగ్ చేయడానికి ఫిట్‌గా ఉన్నప్పటికీ.. బౌలింగ్ ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం హార్దిక్ పాండ్యా బెంగళూరులోని నేషనల్‌ క్రికెట్‌ అకాడమీలో ఉన్నాడు. అక్కడ హార్దిక్ ఫిట్‌నెస్ పరీక్షలో పాల్గొనున్నాడు. ఇక ఐపీఎల్‌ కొత్త జట్టు అవతరించిన గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా బాధ్యతలు నిర్వహించనున్న విషయం విధితమే. అయితే ఫిట్‌నెస్ పరీక్షలను క్లియర్ చేయడంలో హార్దిక్ విఫలమైతే ఐపీఎల్‌లో ఆడ‌డానికి బీసీసీఐ అనుమ‌తించ‌దు." హార్దిక్  రెండు రోజులు పాటు నేషనల్‌ క్రికెట్‌ అకాడమీలో ఉంటాడు.

వివిధ ఫిట్‌నెస్ పరీక్షలలో పాల్గొంటాడు. అతను సెంట్రల్ కాంట్రాక్ట్ క్రికెటర్, అతడు టీ20 ప్రపంచకప్‌ నుంచి ఎటువంటి క్రికెట్ ఆడలేదు. గత కొంతకాలంగా ఫిట్‌నెస్ పరీక్ష తప్పనిసరి అయినందున అతను తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. గత ఏడాది, శ్రేయాస్ అయ్యర్ కూడా ఐపీఎల్‌ ఆడటానికి ముందు ఫిట్‌నెస్ టెస్ట్ హాజరయ్యాడు" అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఇక గుజరాత్ టైటాన్స్ జట్టు మార్చి 28న లక్నో సూపర్‌జెయింట్స్‌తో తమ తొలి మ్యాచ్‌ను ఆడనుంది. అదే విధంగా ఐపీఎల్‌-2022 మార్చి 26నుంచి ఫ్రారంభం కానుంది.

గుజరాత్‌ టైటాన్స్‌: హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్, శుభ్‌మన్ గిల్, మహ్మద్ షమీ, లాకీ ఫెర్గూసన్, అభినవ్ సదరంగాని, డేవిడ్ మిల్లర్, వృద్ధిమాన్ సాహా, మాథ్యూ వేడ్, వరుణ్ ఆరోన్, బి సాయి సుదర్శన్, రాహుల్ తెవాటియా, నూర్ అహ్మద్, సాయి కిషోర్, విజయ్ శంకర్, జయంత్ యాదవ్, డొమినిక్ డ్రేక్స్, దర్శన్ నల్కండే, యశ్‌రీ జోసెఫ్ దయాల్, ప్రదీప్ జోసెఫ్ దయాల్.

చదవండి: IPL 2022 Gujarat Titans Jersey: గుజరాత్‌ టైటాన్స్‌ జెర్సీ ఆవిష్కరణ.. సర్‌ప్రైజ్‌కు సిద్ధంగా ఉండాలన్న కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా

Videos

వల్లభనేని వంశీకి అస్వస్థత

సారీ బాబు గారు.. ఇక్కడ బిల్డింగులు కట్టలేం

కవిత లేఖ ఓ డ్రామా: బండి సంజయ్

హైదరాబాద్ లో కరోనా కేసు నమోదు

జహీరాబాద్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: సీఎం రేవంత్

ప్రకాశం జిల్లా రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ విచారం

YSRCP హరికృష్ణను పోలీసులు బలవంతంగా తీసుకెళ్లి.. దారుణం! : Ambati Rambabu

Sake Sailajanath: ఆరోపణలే తప్ప ఆధారాలు లేవు

First case: కడప కరోనా కేసును దాచిపెట్టేందుకు అధికారుల యత్నం

హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి ట్రంప్ సర్కార్ 6 షరతులు

Photos

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)