Breaking News

చాలా బాధ‌గా ఉంది.. ఆ త‌ప్పే మా కొంప‌ముంచింది: హార్దిక్ పాండ్యా

Published on Sun, 05/12/2024 - 12:15

ఐపీఎల్‌-2024లో ముంబై ఇండియ‌న్స్ తీరు ఏ మాత్రం తీర‌లేదు.  ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా ఈడెన్‌గార్డెన్స్ వేదిక‌గా కోల్‌కతా నైట్‌రైడ‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 18 ప‌రుగుల తేడాతో ముంబై ఇండియ‌న్స్ ఓట‌మి పాలైంది. ఈ ఏడాది సీజ‌న్‌లో ముంబైకు ఇది తొమ్మిదో ఓట‌మి కావ‌డం గ‌మనార్హం. ఇప్ప‌టికే ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్ర‌మించిన ముంబై.. ఆఖరి మ్యాచ్‌ల‌లోనూ త‌మ మార్కును చూపించ‌లేక‌పోతుంది. 

ఈ మ్యాచ్‌లో 158 ప‌రుగుల ల‌క్ష్యంతో బరిలోకి దిగిన ముంబై.. నిర్ణీత 16 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి 139 ప‌రుగులకే ప‌రిమిత‌మైంది. ముంబై బ్యాట‌ర్ల‌లో ఇషాన్ కిష‌న్ (40) ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలవ‌గా.. తిల‌క్ వర్మ‌(32) ప‌రుగుల‌తో ప‌ర్వాలేద‌న్పించారు. మిగితా బ్యాట‌ర్లంతా విఫ‌ల‌మ‌య్యారు.

 అంత‌కుముందు బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 16 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. కేకేఆర్ బ్యాట‌ర్ల‌లో వెంకటేశ్‌ అయ్యర్‌ (21 బంతుల్లో 42; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. నితీశ్‌ రాణా (23 బంతుల్లో 33; 4 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. ఇక ఈ ఓట‌మిపై మ్యాచ్ అనంత‌రం హార్దిక్ పాండ్యా స్పందించాడు. బ్యాటింగ్ వైఫ‌ల్యం కార‌ణంగానే ఓడిపోయామ‌ని హార్దిక్ తెలిపాడు.

"ఈ ఓట‌మిని జీర్ణించుకోవ‌డానికి కొంచెం క‌ష్టంగా ఉంది. ల‌క్ష్య చేధ‌న‌లో మాకు అద్బుత‌మైన ఆరంభం ల‌భించిన‌ప్ప‌టికి మేము స‌ద్వినియోగ‌ప‌రుచుకోలేక‌పోయాము. వాతవార‌ణ ప‌రిస్ధితుల కార‌ణంగా పిచ్‌ కొంచెం మేము అనుకున్న‌దాని కంటే కొంచెం భిన్నంగా ఉంది. 

అయితే బ్యాటింగ్‌కు మ‌రి అంత క‌ష్ట‌మైన వికెట్(ఈడెన్ పిచ్‌) అయితే కాదు. ప‌రిస్థితుల‌కు త‌గ్గ‌ట్టు మా బౌల‌ర్లు బాగా బౌలింగ్ చేశారు. 158 ప‌రుగుల టార్గెట్ అనేది మ‌రి అంత పెద్ద ల‌క్ష్య‌మేమి కాదు. తొలుత మేము బౌలింగ్ చేసే ట‌ప్పుడు మా బౌల‌ర్లు కాస్త ఇబ్బంది పడ్డారు. బంతి బౌండ‌రీకి వెళ్లిన ప్ర‌తీసారి పూర్తిగా త‌డిగా మారి వెనుక్కి వ‌చ్చేది. 

మంచు ప్ర‌భావం ఎక్కువ‌గా ఉండ‌డంతో ప్ర‌త్య‌ర్ధి బ్యాట‌ర్లు బౌండ‌రీల‌ను అల‌వోక‌గా బాదారు.ఇక మా చివ‌రి మ్యాచ్ కోసం ప్ర‌త్యేక ప్ర‌ణాళిక‌ల‌లు ఏమీ లేవు.  వీలైనంత‌వ‌ర‌కు టోర్నీని విజ‌యంతో ముగించేందుకు ప్ర‌య‌"త్నిస్తాము. ఏదమైన‌ప్ప‌టికి ఈ ఏడాది సీజ‌న్‌లో మా స్ధాయికి త‌గ్గ ప్ర‌ద‌ర్శ‌న చేయ‌లేకపోయామని పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేష‌న్‌లో హార్దిక్ పేర్కొన్నాడు.

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)