Breaking News

MI Vs LSG: ఏం చేస్తున్నావ్‌ హార్దిక్‌?!​.. ఆకాశ్‌ అంబానీ ఆగ్రహం!

Published on Sat, 04/05/2025 - 12:50

ఐపీఎల్‌-2025 (IPL 2025) సీజన్‌ను పరాజయంతో ప్రారంభించిన ముంబై ఇండియన్స్‌ (Mumbai Indians) వైఫల్యాలు కొనసాగుతున్నాయి. తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ చేతిలో ఓడిన హార్దిక్‌ సేన.. ఆ తర్వాత గుజరాత్‌ టైటాన్స్‌ చేతిలోనూ పరాజయం పాలైంది.

ఈ క్రమంలో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌పై గెలుపుతో విజయాల బాట పట్టిందనుకుంటే.. తాజాగా లక్నో సూపర్‌ జెయింట్స్‌ ముందు తలొగ్గింది. లక్నోలోని ఏకనా స్టేడియంలో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో పంత్‌ సేన చేతిలో 12 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ పోరులో.. లక్ష్య ఛేదనలో భాగంగా ముంబై నాయకత్వ బృందం తీసుకున్న నిర్ణయాలు ఆశ్చర్యపరిచాయి.

విజయానికి ఇరవై నాలుగు పరుగుల దూరంలో ఉ‍న్న సమయంలో బ్యాటర్‌ తిలక్‌ వర్మ ( Tilak Varma- 23 బంతుల్లో 25)ను రిటైర్డ్‌ అవుట్‌గా వెనక్కి పిలిపించారు. అతడి స్థానంలో హార్దిక్‌ పాండ్యాకు జతగా బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ మిచెల్‌ సాంట్నర్‌ క్రీజులోకి వచ్చాడు.  

పరుగు తీసేందుకు నిరాకరణ
ఇక ఆఖరి ఓవర్లో ముంబై గెలుపునకు 22 పరుగులు అవసరమైన సమయంలో .. ఆవేశ్‌ ఖాన్‌ బౌలింగ్‌లో హార్దిక్‌ తొలి బంతికే సిక్సర్‌ బాదాడు. దీంతో ముంబై శిబిరంలో జోష్‌ కనిపించింది. అయితే, ఆ తర్వాత ఆవేశ్‌ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశాడు. రెండో బంతికి రెండు పరుగులు ఇచ్చాడు ఈ పేస్‌ బౌలర్‌. అయితే, మూడో బంతికి సింగిల్‌ తీసే అవకాశం ఉన్నా పాండ్యా మాత్రం అందుకు నిరాకరించాడు.

ఈ క్రమంలో మూడో బంతికి ముంబై పరుగులేమీ రాబట్టలేకపోగా.. నాలుగో బంతి కూడా డాట్‌ అయింది. అప్పటికే ముంబై పరాజయం దాదాపుగా ఖరారు కాగా.. ఐదో బంతికి హార్దిక్‌ సింగిల్‌ తీసి.. సాంట్నర్‌ను క్రీజులోకి పంపాడు. ఆఖరి బంతికి సాంట్నర్‌ పరుగులేమీ రాబట్టలేదు. ఫలితంగా పన్నెండు పరుగుల తేడాతో ముంబైకి పరాజయం తప్పలేదు.

 ఆకాశ్‌ అంబానీ ఆగ్రహం
అయితే, తిలక్‌ వర్మను కాదని ‘హిట్టింగ్‌’ కోసమని సాంట్నర్‌ను పంపిన ముంబై వ్యూహం బెడిసికొట్టగా.. సాంట్నర్‌కు స్ట్రైక్‌ ఇచ్చేందుకు హార్దిక్‌ నిరాకరించడం జట్టు యజమాని ఆకాశ్‌ అంబానీకి కోపం తెప్పించింది. ఆఖరి ఓవర్‌ మూడో బంతికి హార్దిక్‌ చేసిన పనికి ఆకాశ్‌ ఇచ్చిన రియాక్షన్‌ వైరల్‌గా మారింది.

మరోవైపు.. ఆఖరి ఓవర్‌ ఐదో బంతికి లక్నో విజయం దాదాపు ఖరారు కాగా.. లక్నో ఓనర్‌ సంజీవ్‌ గోయెంకా ముఖం ఆనందంతో వెలిగిపోయింది. చప్పట్లు కొడుతూ అతడు విజయాన్ని సెలబ్రేట్‌ చేసుకోగా.. మరోవైపు ఆకాశ్‌​ మాత్రం తమ సభ్యులతో సీరియస్‌గా చర్చించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి.

ఐపీఎల్‌-2025:లక్నో వర్సెస్‌ ముంబై
లక్నో స్కోరు: 203/8 (20)
ముంబై స్కోరు: 191/5 (20)
ఫలితం: 12 పరుగుల తేడాతో ముంబైపై లక్నో గెలుపు.

చదవండి: హిట్టర్లు అవసరం.. అందుకే తిలక్‌ను వెనక్కి పంపించాం: హార్దిక్‌

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)