Breaking News

జ‌ట్టులో చోటు ఎందుకన్నారు.. క‌ట్ చేస్తే అత‌డే వ‌రల్డ్‌క‌ప్ హీరో

Published on Sun, 06/30/2024 - 12:18

ఐపీఎల్‌-2024లో పేలవ ప్ర‌ద‌ర్శన క‌న‌బ‌రిచి తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొన్న టీమిండియా స్టార్ ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా.. ఇప్పుడు హీరోగా మారిపోయాడు.  అతడిని విమ‌ర్శించిన నోళ్లే ఇప్పుడు శెభాష్ అని పొగుడుతున్నాయి. టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024 ఎంపిక చేసిన భార‌త జ‌ట్టులో హార్దిక్ పాండ్యాకు చోటు ద‌క్క‌డం పై కూడా పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. 

ఫామ్‌లో లేని ఆట‌గాడికి ఛాన్స్ ఎందుకు ఇచ్చార‌ని సెల‌క్ట‌ర్ల‌పై కూడా చాలా మంది మాజీలు ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించాడు. అయితే త‌నపై వ‌చ్చిన విమ‌ర్శ‌లన్నింట‌కి హార్దిక్ త‌న ఆట‌తోనే సమాధానమిచ్చాడు.  టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో పాండ్యా అద్బుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. ఆల్‌రౌండ్ షోతో హార్దిక్ అద‌ర‌గొట్టాడు.

కీల‌క‌మైన ఫైన‌ల్లో సైతం పాండ్యా స‌త్తాచాటాడు. బ్యాటింగ్‌లో త‌న మార్క్ చూపించే అవ‌కాశం పెద్ద‌గా రాకపోయిన‌ప్ప‌టికి బౌలింగ్‌లో మాత్రం దుమ్ములేపాడు. ఓట‌మి త‌ప్ప‌ద‌నుకున్న పాండ్యా మ్యాజిక్ చేశాడు. 17 ఓవ‌ర్ వేసిన పాండ్యా.. చేలరేగి ఆడుతున్న క్లాసెన్‌ను అద్బుత‌మైన బంతితో బోల్తా కొట్టించాడు. 

క్లాసెన్ వికెట్ మ్యాచ్ స్వ‌రూపాన్నే మార్చేసింది. అనంత‌రం ఆఖ‌రి ఓవ‌ర్‌లో ద‌క్షిణాఫ్రికా విజ‌యానికి 16 ప‌రుగులు అవ‌స‌ర‌మ‌య్యాయి. చివ‌రి ఓవ‌ర్ వేసే బాధ్య‌త‌ను కూడా రోహిత్‌.. హార్దిక్ పాండ్యాకే అప్ప‌గించాడు. కెప్టెన్ న‌మ్మ‌కాన్ని పాండ్యా నిలబెట్ట‌కున్నాడు. కేవ‌లం 8 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి భార‌త్‌కు అద్బుత‌మైన విజ‌యాన్ని అందించాడు. 

భార‌త్ విజ‌యం సాధించ‌గానే పాండ్యా భావోద్వేగానికి లోన‌య్యాడు. భార‌త జెండా ప‌ట్టుకుని స్టేడియం మొత్తం పాండ్యా తిరిగాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. 

ఈ ఫైన‌ల్ మ్యాచ్‌లో 3 ఓవ‌ర్లు బౌలింగ్ చేసి కేవ‌లం 20 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి  మూడు వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఓవ‌రాల్‌గా ఈ టోర్నీలో 8 మ్యాచ్‌లు ఆడి 144 ప‌రుగుల‌తో పాటు 11 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఈ క్ర‌మంలో పాండ్యాపై నెటిజ‌న్లు సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)