Breaking News

చరిత్ర సృష్టించిన హార్దిక్ పాండ్యా.. 17 ఏళ్ల ధోని రికార్డు బద్దలు

Published on Sun, 06/23/2024 - 11:57

టీ20 వరల్డ్‌కప్‌-2024లో టీమిండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా సత్తాచాటుతున్నాడు. తన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో భారత జట్టుకు అద్బుతమైన విజయాలు అందిస్తున్నాడు.

తాజాగా ఈ మెగా టోర్నీ సూపర్‌-8లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాండ్యా ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు. బ్యాటింగ్‌లో ఆజేయ అర్ధశతకం సాధించిన పాండ్యా.. బౌలింగ్‌లో ఓ కీలక వికెట్ పడగొట్టాడు. ఈ క్రమంలో హార్దిక్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.

హార్దిక్ సాధించిన రికార్డులు ఇవే..
→టీ20 ప్రపంచకప్ చరిత్రలో  300 పరుగులు, 20+ వికెట్లు సాధించిన తొలి భారత క్రికెటర్‌గా హార్దిక్ రికార్డులకెక్కాడు.  టీ20 వరల్డ్‌కప్‌​లో ఇప్పటివరకు 21 మ్యాచ్​లు ఆడిన  హార్దిక్ .. 137.89 స్ట్రైక్​రేట్​తో 302 పరుగులు చేశాడు. అటు బౌలింగ్‌లోనూ 21 వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన జాబితాలో పాండ్యా ఐదో స్ధానంలో నిలిచాడు.

షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్)- 853 పరుగులు, 50 వికెట్లు
షాహిద్ అఫ్రిది (పాకిస్థాన్)- 546 పరుగులు, 39 వికెట్లు
షేన్ వాట్సన్ (ఆస్ట్రేలియా)- 537 పరుగులు, 22 వికెట్లు
డ్వేన్​ బ్రావో (వెస్టిండీస్)- 530 పరుగులు, 27 వికెట్లు

→టీ20 ప్రపంచకప్​లో ఆరో స్థానంలో బ్యాటింగ్​కు వచ్చి అత్యధిక స్కోర్ సాధించిన తొలి భారత ప్లేయర్‌గా పాండ్యా రికార్డు సృష్టించాడు.

ఇప్పటివరకు ఈ రికార్డు సురేశ్ రైనా (45 పరుగులు), ధోనీ (45) పేరిట ఉండేది. 2007 టీ20 ప్రపంచకప్‌లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోనీ ఆరో స్థానంలో బ్యాటింగ్ చేసి 33 బంతుల్లో 45 పరుగులు చేశాడు.

2012 టీ20 ప్రపంచకప్‌లో సౌతాఫ్రికాతోనే జరిగిన మ్యాచ్‌లో ఆరోస్థానంలో బ్యాటింగ్ చేసిన సురేశ్ రైనా 34 బంతుల్లో 45 పరుగులే చేశాడు. కాగా తాజా మ్యాచ్‌లో 50 పరుగులు చేసిన పాండ్యా వారిద్దరి రికార్డును బ్రేక్ చేశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. బంగ్లాదేశ్‌పై టీమిండియా 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)