Breaking News

బుమ్రా, భువనేశ్వర్‌ను దాటేసిన హార్దిక్‌ పాండ్యా..

Published on Thu, 01/23/2025 - 10:34

టీమిండియా స్టార్ ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా(Hardik Pandya ) ఓ అరుదైన ఘ‌న‌తను త‌న పేరిట లిఖించుకున్నాడు. అంత‌ర్జాతీయ టీ20ల్లో అత్య‌ధిక వికెట్లు ప‌డ‌గొట్టిన మూడో భార‌త బౌల‌ర్‌గా పాండ్యా రికార్డుల‌కెక్కాడు. బుధ‌వారం కోల్‌క‌తా వేదిక‌గా ఇంగ్లండ్‌తో జ‌రిగిన తొలి టీ20లో రెండు వికెట్లు పడగొట్టిన హార్దిక్‌.. ఈ రి​కార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. హార్దిక్ ఇప్పటివరకు 111 మ్యాచ్‌లు ఆడి 91 వికెట్లు పడగొట్టాడు.

ఈ క్రమంలో టీమిండియా పేస్ గుర్రం జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్‌లను హార్దిక్‌ అధిగమించాడు. బుమ్రా 70 మ్యాచ్‌ల్లో 89  వికెట్లు పడగొట్టగా.. భువనేశ్వర్ 87 మ్యాచ్‌ల్లో 90 వికెట్లు పడగొట్టాడు. ఇక అరుదైన ఘనత సాధించిన జాబితాలో టీమిండియా యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ అగ్రస్ధానంలో ఉన్నాడు.

అర్ష్‌దీప్ 61 మ్యాచ్‌ల్లో 97 వికెట్లు పడగొట్టాడు. అర్ష్‌దీప్ సైతం ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లోనే ఈ ఘనత సాధించడం గమనార్హం. అర్ష్‌దీప్ తర్వాత స్ధానంలో స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్‌(96) ఉన్నాడు. ఇక మ్యాచ్‌​ విషయానికి వస్తే.. పర్యాటక ఇంగ్లండ్‌ను 7 వికెట్ల తేడాతో భారత్ చిత్తు చేసింది.

తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ జోస్ బట్లర్(44 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 68) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో వరుణ్‌​ చక్రవర్తి మూడు వికెట్లు పడగొట్టగా.. అక్షర్ పటేల్‌, అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా తలా రెండు వికెట్లు తీశారు.

అనంతరం స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా కేవ‌లం 3 వికెట్లు మాత్ర‌మే కోల్పోయి 12.5 ఓవర్లలోనే చేధించింది. భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టించాడు. కేవలం 34 బంతుల్లో 5 ఫోర్లు,8 సిక్స్‌లతో 79 పరుగులు చేసి భారత్‌కు అద్భుతమైన విజయాన్ని అందించాడు. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 జనవరి 25న చెన్నై వేదికగా జరగనుంది.
చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన అభిషేక్‌.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)