Breaking News

భారత్‌కు తిరిగి వస్తూ పాండ్యా ఏం చేశాడంటే!

Published on Sat, 11/26/2022 - 21:48

టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా ఆన్‌ అండ్‌ ఆఫ్‌ ఫీల్డ్‌లో చాలా కూల్‌గా కనిపిస్తున్నాడు. ఒకప్పుడు పాండ్యా అంటే ఫైర్‌బ్రాండ్‌కు పెట్టింది పేరు. మైదానంలో బరిలోకి దిగాడంటే దూకుడైన ఆటతీరుతో అగ్రెసివ్‌నెస్‌ కనబడేవాడు. కానీ ఎప్పుడైతే గాయంతో ఆటకు దూరమయ్యాడో అప్పటి నుంచి పాండ్యా పూర్తిగా మారిపోయాడు. గాయం నుంచి కోలుకున్న తర్వాత ఐపీఎల్‌లో గుజరాత్‌ టైటాన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. డెబ్యూ సీజన్‌లోనే గుజరాత్‌ టైటాన్స్‌ టైటిల్‌ కొట్టడంలో కెప్టెన్‌గా.. ఆటగాడిగా పాండ్యాదే కీలకపాత్ర. ఐపీఎల్‌ మొత్తంగా పరిణితితో కూడిన పాండ్యానే కనిపించాడు. ఆ తర్వాత టీమిండియాలోకి తిరిగి ఎంట్రీ ఇచ్చిన పాండ్యా అదే నిలకడను కొనసాగిస్తున్నాడు.

టి20 ప్రపంచకప్‌ ముగిసిన తర్వాత టీమిండియా న్యూజిలాండ్‌ పర్యటనకు వచ్చింది. రోహిత్‌ గైర్హాజరీలో టి20 కెప్టెన్‌గా వ్యవహరించిన పాండ్యా టీమిండియాకు సిరీస్‌ విజయాన్ని అందించాడు. ప్రస్తుతం ధావన్‌ నేతృత్వంలో టీమిండియా మూడు వన్డేల సిరీస్‌ ఆడుతుంది. ఇప్పటికే తొలి వన్డే ఓడిన టీమిండియా ఆదివారం రెండో వన్డే ఆడనుంది. ఇక వన్డే సిరీస్‌కు పాండ్యాను ఎంపిక చేయలేదు. దీంతో స్వదేశానికి బయలుదేరిన పాండ్యా తన చర్యతో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాడు.

న్యూజిలాండ్‌ పర్యటనలో టీమిండియా ప్రయాణం చేసిన బస్సుకు డ్రైవర్‌గా ఉన్న వ్యక్తికి పాండ్యా తన జెర్సీని గిఫ్ట్‌గా ఇచ్చాడు. అంతేకాదు ఆ జెర్సీపై పాండ్యాతో పాటు ఇతర క్రికెటర్ల సంతకాలు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించిన వీడియోనూ సదరు బస్‌ డ్రైవర్‌ షేర్‌ చేసుకున్నాడు. పాండ్యా ప్రేమతో ఇచ్చిన జెర్సీని తాను వేలం వేసే ప్రయత్నం చేస్తానని పేర్కొన్నాడు. 

చదవండి: మెస్సీపై అభిమానం దేశాలను దాటించింది

Videos

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

ప్లాప్ సినిమాకు ఎందుకంత బిల్డప్ : Perni Nani

జగన్ హయాంలో స్కాం జరగలేదని స్పష్టంగా తెలుస్తుంది: పోతిన మహేష్

తెలంగాణలో అసలైన పొలిటికల్ దెయ్యం ఎవరు..?

వంశీకి ఏమైనా జరిగితే... పేర్ని నాని మాస్ వార్నింగ్

YSR జిల్లాలో రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

జగన్ ఫోటో చూసినా మీకు భయమే కదా..!

నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలో అన్నదాతల ఆవేదన

హైదరాబాద్ లో ఉల్లి కొరత?

పవన్ కళ్యాణ్ సినిమా కోసం మంత్రి దుర్గేష్ వార్నింగ్

Photos

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)