Breaking News

క‌న్నీరు పెట్టుకున్న హార్దిక్.. ఏమైందంటే? వీడియో వైర‌ల్‌

Published on Mon, 03/25/2024 - 17:18

టీమిండియా స్టార్ ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్‌గా త‌న‌ తొలి మ్యాచ్‌లోనే ఓట‌మి చ‌విచూశాడు. ఐపీఎల్‌-2024లో భాగంగా అహ్మ‌దాబాద్ వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్ జ‌రిగిన మ్యాచ్‌లో 6 ప‌రుగుల తేడాతో ముంబై ఇండియ‌న్స్ ఓట‌మి చ‌విచూసింది. సునాయ‌సంగా గెలవాల్సిన మ్యాచ్‌లో అనూహ్యంగా ముంబై ఓట‌మి పాలైంది. 

ఆఖ‌రి ఓవ‌ర్‌లో ముంబై ఇండియ‌న్స్ విజ‌యానికి 19 ప‌రుగులు అవ‌స‌ర‌మ‌య్యాయి. గుజ‌రాత్ కెప్టెన్ గిల్‌ ఆఖ‌రి ఓవ‌ర్ వేసే బాధ్య‌త‌ను సీనియ‌ర్ పేస‌ర్ ఉమేశ్ యాద‌వ్‌కు అప్ప‌గించాడు. మ‌రోవైపు క్రీజులో హార్దిక్ పాండ్యా ఉండ‌డంతో ముంబై డ‌గౌట్‌లో ఇంకా తాము గెలుస్తామ‌న్న థీమా క‌న్పించింది. 

అందుకు త‌గ్గ‌ట్టే హార్దిక్ తొలి రెండు బంతుల‌ను వ‌రుస‌గా సిక్స్‌, ఫోర్‌గా మలిచాడు. దీంతో ఒక్కసారిగా మ్యాచ్ మొత్తం ముంబై ఇండియ‌న్స్ వైపు మ‌లుపు తిరిగింది.  కానీ అద్భుత‌మైన క‌మ్‌బ్యాక్ ఇచ్చిన ఉమేశ్‌.. సూప‌ర్ డెలివ‌రీతో హార్దిక్‌ను బోల్తా కొట్టించాడు. మూడో బంతిని స్లో బౌన్సర్‌గా యాద‌వ్ సంధించాడు. ఈ క్ర‌మంలో హార్దిక్ మ‌రో భారీ షాట్ ఆడ‌టానికి ప్ర‌య‌త్నించాడు. 

అయితే షాట్ స‌రిగ్గా క‌న‌క్ట్ కాక‌పోవ‌డంతో బంతి నేరుగా రాహుల్ తెవాటియా చేతికి వెళ్లాడు. దీంతో ఒక్క‌సారిగా హార్దిక్ షాక్‌కు గుర‌య్యాడు. ఈ క్ర‌మంలో డౌగౌట్‌కు న‌డిచివెళ్తుండగా హార్దిక్ భావ‌ద్వోగానికి లోన‌య్యాడు. ఉబికి వ‌స్తున్న క‌న్నీళ్లను హార్దిక్ ఆపున్‌కుంటూ డ‌గౌట్‌కు వెళ్లాడు. 

ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. కాగా ఈ మ్యాచ్‌లో హార్దిక్‌ను రోహిత్ శ‌ర్మ ఫ్యాన్స్ టార్గెట్ చేశారు. టాస్ స‌మయంలో హార్దిక్ మైదానంలో రాగానే రోహిత్ రోహిత్ అంటూ బోయింగ్ చేశారు. అదేవిధంగా  ఈ మ్యాచ్‌లో రోహిత్ శ‌ర్మ ఫీల్డింగ్ పోజిషన్‌ను హార్దిక్ పాండ్యా ప‌దేప‌దే మారుస్తూ అభిమానుల అగ్ర‌హానికి గుర‌య్యాడు.

అంతేకాకుండా ఈ మ్యాచ్‌లో హార్దిక్ బ్యాటింగ్‌, బౌలింగ్‌, కెప్టెన్సీ ప‌రంగా దారుణంగా విఫ‌ల‌యయ్యాడు. ఈ క్ర‌మంలో పాండ్యాను నెటిజ‌న్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు. ఆటే అనుకున్నాము.. సీనియ‌ర్ల‌కు గౌర‌వం కూడా ఇవ్వ‌డం రాదా అంటూ తెగ పోస్టులు చేస్తున్నారు. ఇక ఐపీఎల్‌-2024 సీజ‌న్ వేలానికి ముందు ముంబై ఇండియ‌న్స్ త‌మ జ‌ట్టు ప‌గ్గాల‌ను రోహిత్ శ‌ర్మ నుంచి హార్దిక్‌కు అప్ప‌గించిన సంగ‌తి తెలిసిందే.

 గుజ‌రాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ చేసుకుని మ‌రి హార్దిక్‌ను త‌మ జ‌ట్టు కెప్టెన్‌గా ముంబై నియ‌మించింది. అప్ప‌టి నుంచి ముంబై ఫ్రాంచైజీపై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురుస్తోంది. ఐదు ఛాంపియ‌న్‌గా నిలిపిన రోహిత్ ప‌ట్ల ముంబై వ్య‌వ‌హ‌రించిన తీరును అభిమానులు ఇప్ప‌టికి త‌ప్పుబ‌డుతున్నాడు. ఇప్ప‌టిలో ఈ కెప్టెన్సీ వివాదం స‌ద్దుమ‌ణిగేలా క‌న్పించ‌డం లేదు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)