Breaking News

నేను అనుకున్నది జరగలేదు.. కానీ వారు మాత్రం అద్బుతం: హార్దిక్

Published on Mon, 04/01/2024 - 23:42

ఐపీఎల్‌-2024లో ముంబై ఇండియన్స్‌ కథ ఏ మాత్రం మారలేదు. ఈ క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో ముంబై వరుసగా మూడో ఓటమి చవిచూసింది. తమ సొంత గ్రౌండ్ వాంఖడేలో రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ముంబై పరాజయం పాలైంది. 

బ్యాటింగ్‌ పరంగా ముంబై దారుణంగా విఫలమైంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై.. రాజస్తాన్‌ బౌలర్ల దాటికి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 125 పరుగులు మాత్రమే చేసింది. రాజస్తాన్‌ పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌, స్పిన్నర్‌ చాహల్‌ చెరో మూడు వికెట్లలో ముంబైని దెబ్బతీయగా.. బర్గర్‌ రెండు, అవేష్‌ ఖాన్‌ ఒక్క వికెట్‌ సాధించారు.

అనంతరం 126 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌ 15.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రాజస్తాన్‌ రాయల్స్‌ బ్యాటర్లలో రియాన్‌ పరాగ్‌(54 నాటౌట్‌) మరోసారి అదరగొట్టాడు.

ఇక వరుసగా మూడో ఓటమిపై ఈ మ్యాచ్‌ అనంతరం ముంబై కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా స్పందించాడు. బ్యాటింగ్‌లో తాము అనుకున్నవిధంగా రాణించలేకపోయామని పాండ్యా తెలిపాడు.

"ఈ మ్యాచ్‌లో ఓడిపోవడం చాలా బాధగా ఉంది. తొలుత మాకు మంచి ఆరంభం లభించలేదు. కానీ నేను బ్యాటింగ్‌ వచ్చాక ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురుదాడి చేయాలనుకున్నాను. నేను తిలక్‌ క్రీజులో ఉన్నప్పుడు మా స్కోర్‌ 150 నుంచి 160 పరుగులకు చేరుతుందని భావించాను. కానీ నేను ఔటయ్యాక రాజస్తాన్‌ తిరిగి మళ్లీ గేమ్‌లోకి వచ్చింది.

నేను మరో కొన్ని ఓవర్ల పాటు ‍క్రీజులో ఉండాల్సింది. ఇక ఈ రోజు వాంఖడే వికెట్‌ మేము ఊహించిన దానికంటే భిన్నంగా ఉంది. ఓ ఓటమి ఇది నేను సాకుగా చెప్పాలనకోవడం లేదు. ఎందుకంటే ఒక బ్యాటర్‌గా ఎటువంటి వికెట్‌పైనైనా ఆడటానికి సిద్దంగా ఉండాలి. ఏదమైనప్పటికి ప్రత్యర్ధి బౌలర్లు అద్బుతంగా బౌలింగ్‌ చేశారు.

మేము అనుకున్న విధంగా ఫలితాలు రావడం లేదు. కానీ ఒక టీమ్‌గా మాపై మాకు పూర్తి నమ్మకం ఉంది. ఇటువంటి సమయంలోనే ఎ​క్కువ ధైర్యంలో ముందుకు వెళ్లాలి. తర్వాతి మ్యాచ్‌ల్లో మేము తిరిగి కమ్‌బ్యాక్‌ ఇస్తామని" హార్దిక్‌ పోస్ట్‌ మ్యాచ్‌ ప్రేజేంటేషన్‌లో తెలిపాడు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)