Breaking News

అత‌డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. చాలా సంతోషంగా ఉంది: రోహిత్‌ శర్మ

Published on Sun, 06/23/2024 - 07:50

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024లో టీమిండియా జోరును కొన‌సాగుతోంది. ఈ మెగా టోర్నీ సూప‌ర్‌-8లో భాగంగా అంటిగ్వా వేదిక‌గా బంగ్లాదేశ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 50 ప‌రుగుల తేడాతో భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది.

ఈ విజ‌యంతో భార‌త్ సెమీఫైన‌ల్ బెర్త్ లాంఛ‌నమైన‌ట్లే. ఈ మ్యాచ్‌లో భార‌త్ ఆల్‌రౌండ్ షోతో అద‌ర‌గొట్టింది. తొలుత బ్యాటింగ్‌లో 196 ప‌రుగుల భారీ స్కోర్ చేసిన భార‌త్‌.. ఆ త‌ర్వాత బౌలింగ్‌లో ప్ర‌త్య‌ర్ధిని 146 ప‌రుగులకే క‌ట్ట‌డి చేసింది.

భార‌త విజ‌యంలో మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ హార్దిక్ పాండ్యా కీలక పాత్ర పోషించాడు. బ్యాటింగ్‌లో హాఫ్ సెంచ‌రీ చేసిన హార్దిక్‌.. బౌలింగ్‌లో ఓ కీల‌క వికెట్ ప‌డ‌గొట్టాడు. అత‌డితో పాటు కుల్దీప్ యాద‌వ్ మూడు, బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ త‌లా రెండు వికెట్లు సాధించారు. ఇక ఈ విజ‌యంపై మ్యాచ్‌ అనంత‌రం టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ స్పందించాడు.

"టీ20ల్లో దూకుడుగా ఆడటం గురించి నేను చాలా రోజులుగా మాట్లాడుతున్నాను. ఎట్టకేలకు ఈ మ్యాచ్‌లో మేము అనుకున్నది చేసి చూపించాము. అన్ని విభాగాల్లో సత్తాచాటాము. ఓవరాల్‌గా మా ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉన్నాను. 

పరిస్థితులను వేగంగా అందిపుచ్చుకున్నాము. ఈ మైదానంలో గాలులు వీచాయి. కానీ పరిస్థితులకు తగ్గట్టు మేము తెలివిగా వ్యవహరించాం. బ్యాట్‌, బాల్‌తో అద్బుతంగా రాణించాము. ఏది ఏమైనా జట్టులోని 8 మంది బ్యాటర్లు తమ పాత్ర షోషించాలి. 

ఈ మ్యాచ్‌లో ఒ​క్క ప్లేయర్‌ హాఫ్‌ సెంచరీ చేసినప్పటకి మేము 197 పరుగులు చేసాము. టీ20ల్లో భారీ స్కోర్ సాధించాలంటే హాఫ్ సెంచరీలు, సెంచరీలు చేయాల్సిన అవసరం లేదు. జట్టులో బ్యాటర్లు సమిష్టిగా రాణించి ప్రత్యర్ధి బౌలర్లపై ఒత్తిడి తెస్తే చాలు.

ప్రపంచంలో అందరూ ఇలానే ఆడుతున్నారు. మేం కూడా అలానే ఆడాలనుకుంటున్నాం. మా జట్టులో చాలా మంది అనుభవిజ్ఞులైన ఆటగాళ్లు ఉన్నారు. వాళ్లకు జట్టు మెనెజ్‌మెంట్ కూడా సపోర్ట్‌గాఉంది. ఇక హార్దిక్ బ్యాట్‌తో రాణించడం ఎంత ముఖ్యమో అఫ్గాన్‌తో మ్యాచ్ అనంతరం కూడా చెప్పాను.

 అతడి బ్యాటింగ్ మమ్మల్ని పటిష్ట స్థితిలో ఉంచుతుంది. హార్దిక్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. అతడి సత్తా ఎంటో మాకు బాగా తెలుసు. అతడు మా జట్టుకు చాలా ముఖ్యమైన ఆటగాడు. హార్దిక్ ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే రాబోయే మ్యాచ్‌ల్లో కచ్చితంగా మేము మంచి పొజిషేన్‌లో ఉంటాము.

ఈ మ్యాచ్‌లో బౌలర్లతో నేను మాట్లాడిన ప్రతీ సారి మాకు మంచి ఫలితమే వచ్చింది. మా బౌలర్లు కూడా అద్భుతంగా రాణించారు" అని పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో రోహిత్ శర్మ పేర్కొన్నాడు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)