Breaking News

అత‌డి రీ ఎంట్రీ చాలా సంతోషంగా ఉంది: హర్భజన్‌

Published on Sun, 12/21/2025 - 08:11

జాతీయ జట్టు సెలెక్టర్ల పని ఎప్పుడూ కత్తిమీద సామే. వారు ఎంపిక చేసిన జట్టు గెలిస్తే శెభాష్ అంటారు. అదే ఒక్క ఓటమి ఎదురైనా చాలు విమర్శలు వెల్లువెత్తుతాయి. తాజాగా టీ20 ప్రపంచకప్‌-2026కు ఎంపిక చేసిన భారత జట్టుపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ మెగా టోర్నీకి జట్టు ఎంపిక సందర్భంగా అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ అనుహ్య నిర్ణయాలు తీసుకుంది. 

స్టార్ బ్యాటర్‌, వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌పై వేటు పడింది. పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న గిల్‌ను జట్టు నుంచి తప్పించారు. అతడి స్దానంలో రింకూ సింగ్‌.. జితేష్ శర్మ ప్లేస్‌లో వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ స్పిన్నర్‌ హర్భజన్ సింగ్ బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌కు పదికి పది మార్కులు వేశాడు. కిషన్‌తో పాటు ఫినిషర్ రింకూ సింగ్ కూడా తిరిగి జట్టులోకి వచ్చాడు.

"టీ20 వరల్డ్‌కప్‌కు అద్భుతమైన జట్టును ఎంపిక చేశారు. అజిత్ అగార్కర్‌, మెనెజ్‌మెంట్‌కు 10కి 10 మార్కులు ఇవ్వాలనుకుంటున్నాను. అయితే శుభ్‌మన్ గిల్‌ను పక్కన పెట్టడం కష్టమైన నిర్ణయమైనప్పటికి.. జట్టు కూర్పుకే సెలెక్టర్లు ప్రాధాన్యత ఇచ్చారు. కానీ టీ20ల్లో ఇదే అతడికి చివరి అవకాశం కాదు. గిల్ తిరిగొస్తాడన్న నమ్మకం నాకు ఉంది.

రింకూ సింగ్ తిరిగి జట్టులోకి రావడం చాలా చాలా సంతోషంగా ఉంది. అతడికి రాక జట్టుతో మరింత పటిష్టంగా మారింది. అదేవిధంగా జితేష్ శర్మ స్ధానంలో సెకెండ్ వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్‌ను ఎంపిక చేయడం సరైన నిర్ణయమే. ఎందుకంటే 7 లేదా 8వ స్థానాల్లో ఆడే బ్యాటర్లు ఇప్పటికే జట్టులో చాలా మంది ఉన్నారు.  టాప్ ఆర్డర్‌లో మెరుపులు మెరిపించే పవర్ హిట్టర్ జట్టుకు కావాలి. ఆ బాధ్యతను ఇషాన్ నెరవేరుస్తాడన్న నమ్ముతున్నాను" అని భజ్జీ పేర్కొన్నాడు.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)