మమ్మల్ని క్షమించండి.. దయచేసి ఇక్కడితో ఆపేయండి: హర్భజన్

Published on Tue, 07/16/2024 - 08:24

ఇంగ్లండ్ వేదిక‌గా జ‌రిగిన వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) టైటిల్‌ను ఇండియా ఛాంపియ‌న్స్ కైవ‌సం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఫైన‌ల్లో పాకిస్తాన్ ఛాంపియ‌న్స్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించి ట్రోఫీని భార‌త్ ముద్దాడింది.

అయితే విజ‌య‌నంత‌రం భార‌త మాజీ క్రికెట‌ర్లు, డ‌బ్ల్యూసీఎల్ విన్నింగ్ టీమ్ స‌భ్యులు హర్భజన్ సింగ్, సురేశ్ రైనా, యువరాజ్ సింగ్‌లు బాలీవుడ్ సాంగ్ తౌబ.. తౌబకు కుంటుతూ స‌ర‌ద‌గా డ్యాన్స్ చేశారు.

ఇందుకు సంబంధించిన వీడియోను యువ‌రాజ్ సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు. అయితే ఈ రీల్‌పై దివ్యాంగులు ఆగ్రహం వ్య‌క్తం చేశారు. పారా బ్యాడ్మింటన్ స్టార్ మానసి జోషి దివ్యాంగుల మనోభావాలను దెబ్బ‌తీశార‌ని ఈ ముగ్గురి క్రికెట‌ర్ల‌పై మండిప‌డింది.

అదే విధంగా నేషనల్ సెంటర్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ ఫర్ డిసేబుల్డ్ పీపుల్ (NCPEDP) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అర్మాన్ అలీ కూడా క్రికెటర్లపై పోలీస్‌ల‌కు ఫిర్యాదు చేశాడు. ప్ర‌స్తుతం వారి చేసిన రీల్ వివాద‌స్ప‌దం కావ‌డంతో హర్భజన్ సింగ్ స్పందించాడు. దివ్యాంగులకు భ‌జ్జీ క్ష‌మ‌ప‌ణలు తెలిపాడు.

"ఇంగ్లండ్‌లో ఛాంపియన్‌షిప్ గెలిచిన అనంతరం మేం చేసిన టౌబా టౌబా రీల్‌‌పై వచ్చిన ఫిర్యాదులపై ఓ క్లారిటీ ఇవ్వాల‌న‌కుంటున్నాను. మేము ఎవరి మనోభావాలను దెబ్బతీయాలని అనుకోలేదు. ప్ర‌తీ వ్య‌క్తికి, ప్ర‌తీ క‌మ్యూనిటీని మేము గౌరవిస్తాము.

15 రోజుల పాటు విరామం లేకుండా క్రికెట్ ఆడిన తర్వాత మా ఒళ్లు హూనమైందని తెలియజేసేందుకు ఈ వీడియోను చేశాము. మేము ఎవరినీ కించపరచడానికి ఈ వీడియో చేయ‌లేదు. 

ఇప్పటికీ మేము ఏదో తప్పు చేశామని ప్రజలు భావిస్తుంటే.. అంద‌రికి నా త‌ర‌పున క్ష‌మ‌ప‌ణలు తెలుపుతున్నాను. ద‌య‌చేసి దీన్ని ఇక్కడ‌తో ఆపేయండి" అంటూ ఎక్స్ పోస్ట్‌లో రాసుకొచ్చాడు.

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)