Breaking News

హనుమా విహ‌రి ఎంట్రీ..! ఆ జ‌ట్టుకు వీడ్కోలు ప‌లికిన కెప్టెన్‌?

Published on Fri, 08/29/2025 - 09:26

దేశ‌వాళీ సీజ‌న్ 2025-26కు ముందు టీమిండియా ఆట‌గాడు, వెట‌ర‌న్ డొమాస్టిక్ క్రికెట‌ర్ మ‌న్‌దీప్ సింగ్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నాడు. త్రిపుర క్రికెట్ అసోయేషిన్‌తో 33 ఏళ్ల మ‌న్‌దీప్ సింగ్ తెగ‌దింపులు చేసుకున్నాడు. ఆంధ్ర స్టార్ ప్లేయ‌ర్ హ‌నుమా విహ‌రి త్రిపుర జ‌ట్టుకు ఆడ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించిన కొద్ది రోజుల్లోనే మ‌న్‌దీప్ ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. 

మ‌న్‌దీప్ సింగ్ గ‌త సీజ‌న్‌లో పంజాబ్ నుంచి త‌న మకాంను త్రిపుర‌కు మార్చాడు. ఈ క్ర‌మంలో అత‌డు రంజీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ, సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో త్రిపుర జ‌ట్టుకు నాయ‌క‌త్వం వ‌హించాడు. మొత్తంగా 19 మ్యాచ్‌ల‌లో త్రిపుర జ‌ట్టు కెప్టెన్‌గా ఈ పంజాబ్ క్రికెట‌ర్ వ్య‌వ‌హ‌రించాడు. మ‌న్‌దీప్ త్రిపుర జ‌ట్టు త‌ర‌పున అద్బుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. 

రంజీ ట్రోఫీ 2024-25లో ఒక సెంచరీ, ఐదు హాఫ్ సెంచరీలు మ‌న్‌దీప్ సింగ్ చేశాడు. అదేవిధంగా విజయ్ హజారే ట్రోఫీలో మూడు హాఫ్ సెంచరీలు, స‌య్య‌ద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో రెండు హాఫ్ సెంచరీలు న‌మోదు చేశాడు.

దేశ‌వాళీ సీజ‌న్ 2024-25లో ఆడ‌టానికి  అవకాశం ఇచ్చినందుకు త్రిపుర క్రికెట్ అసోయేషిన్‌కి ధన్యవాదాలు. త్రిపుర‌కు ఆడిన స‌మ‌యాన్ని నేను నిజంగా ఆస్వాదించాను. నాకు అక్క‌డ ఎన్నో  అద్భుతమైన జ్ఞాపకాలు ఉన్నాయి. రాబోయే సీజన్‌లో జట్టు విజయం సాధించాలని కోరుకుంటున్నాను. 

నా  తదుపరి అధ్యాయం కోసం ఎదురు చూస్తున్నాను మ‌న్‌దీప్ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నాడు. కాగా రాబోయో సీజ‌న్‌లో త్రిపుర‌కు విహ‌రితో పాటు త‌మిళ‌నాడు ఆల్‌రౌండ‌ర్ విజ‌య్ శంక‌ర్ కూడా ప్రాతినిథ్యం వ‌హించాడు. ఈ విష‌యాన్ని శంక‌ర్ ఇప్ప‌టికే ధ్రువీక‌రించాడు. అన్ని ఫార్మాట్ల‌లో త్రిపుర జ‌ట్టు కెప్టెన్‌గా హ‌నుమ విహారి ఎంపికయ్యే అవ‌కాశ‌ముంది.
చదవండి: Asia Cup 2025: భార‌త్‌-పాక్ మ్యాచ్‌.. టిక్కెట్ ధర ఎన్ని ల‌క్ష‌లంటే?
 

Videos

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)