Breaking News

IND Vs SA: గెలుపు జోష్‌లో ఉన్న సౌతాఫ్రికాకు బిగ్‌ షాక్‌..

Published on Fri, 12/29/2023 - 07:10

టీమిండియాతో తొలి టెస్టులో విజయం సాధించిన జోష్‌లో ఉన్న దక్షిణాఫ్రికాకు బిగ్‌ షాక్‌ తగిలింది. కేప్‌టౌన్‌ వేదికగా భారత్‌తో జరగనున్న రెండో టెస్టుకు ఆ జట్టు కెప్టెన్‌ టెంబా బావుమా గాయం కారణంగా దూరమయ్యాడు. బావుమా ప్రస్తుతం తొడ కండరాల గాయంతో బాధపడుతున్నాడు. సెంచూరియన్‌ వేదికగా జరిగిన మొదటి టెస్టులో తొలి రోజు ఆట సందర్భంగా ఫీల్డింగ్‌ చేస్తుండగా బావుమా గాయపడ్డాడు.

దీంతో అతడు తొలి టెస్టుల్లో తిరిగి మైదానంలో అడుగుపెట్టలేదు. అయితే అతడి గాయం కొంచెం తీవ్రమైనది కావడంతో రెండో టెస్టుకు దూరమయ్యాడు. ఈ విషయాన్ని దక్షిణాఫ్రికా హెడ్‌ కోచ్‌ షుక్రి కాన్రాడ్ దృవీకరించారు. ఇక రెండో టెస్టులో తన కెరీర్‌లో చివరి మ్యాచ్‌ ఆడుతున్న డీన్‌ ఎల్గర్‌ ప్రోటీస్‌ జట్టును నడిపించనున్నాడు. అదే విధంగా బావుమా స్ధానంలో జైబుర్ హంజా జట్టులోకి వచ్చాడు.

"బావుమా ప్రస్తుతం పూర్తి ఫిట్‌నెస్‌తో లేడు. కానీ తొలి టెస్టులో అవసరమైతే తాను ‍బ్యాటింగ్‌ చేయడానికి సిద్దమయ్యాడు. అతడు ప్రస్తుతం మా వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు. బావుమా గాయం నుంచి కోలుకోవడానికి మరో రెండు వారాల సమయం పట్టే అవకాశముంది. ఈ క్రమంలో టెంబా కేప్ టౌన్‌ టెస్టుకు దూరంగా ఉండనున్నాడు. యువ ఆటగాడు జుబేర్ హంజా అతడి స్ధానాన్ని భర్తీ చేయనున్నాడని" ఈఎస్పీఎన్‌తో షుక్రి పేర్కొన్నాడు. కాగా జనవరి 3 నుంచి కేప్‌టౌన్‌ వేదికగా రెండో టెస్టు ప్రారంభం కానుంది.
చదవండి: #Rohit Sharma: అందుకే ఓడిపోయాం.. ప్రధాన కారణాలు అవే! అతడు అద్భుతం

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)