Breaking News

హంపి, దివ్య తొలి గేమ్‌ డ్రా

Published on Sun, 07/27/2025 - 04:05

బతూమి (జార్జియా): భారత్‌కు ఖాయమైన వరల్డ్‌కప్‌ టైటిల్‌ను తమ పరం చేసుకునేందుకు తెలుగు తేజం కోనేరు హంపి, దివ్య దేశ్‌ముఖ్‌ తొలి గేమ్‌లో దీటుగా ఎత్తుకు పైఎత్తులు వేశారు. దాంతో ఈ పోరు సమంగా ముగిసింది. ‘ఫిడే’ మహిళల ప్రపంచకప్‌ నాకౌట్‌ చెస్‌ టోర్నమెంట్‌లో శనివారం జరిగిన తొలి గేమ్‌లో 41 ఎత్తుల తర్వాత ఫలితం వచ్చే అవకాశం లేకపోవడంతో ఇద్దరూ ‘డ్రా’కు మొగ్గు చూపారు. ఈ పోరులో నల్ల పావులతో బరిలోకి దిగిన హంపికి ఓపెనింగ్‌ ఎత్తుగడలేవీ కలిసి రాలేదు. 

గేమ్‌ను మొదలుపెట్టిన వ్యూహం, వేసిన ఎత్తులు ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ను కాస్త ఇరకాటంలో పెట్టాయి. దీంతో తెల్ల పావులతో ఆడుతున్న దివ్యకు అవి అదనపు బలాన్నిచ్చేలా చేశాయి. దీంతో 14వ ఎత్తు వరకు గేమ్‌ దివ్య నియంత్రణలోనే ఉంది. అయితే ఈ దశలో తేరుకున్న హంపి జాగ్రత్త పడింది. ఎత్తుగడ మార్చి పైఎత్తులతో గేమ్‌పై పట్టు పెంచుకుంది. దీంతో అక్కడి నుంచి ఆట పోటాపోటీగా సాగడంతో చివరకు డ్రా తప్పలేదు. 

ఇంటర్నేషనల్‌ మాస్టర్, 19 ఏళ్ల దివ్య ఒక దశలో వెటరన్‌ గ్రాండ్‌మాస్టర్‌కు చెమటలు పట్టించింది. ఈ టోర్నీలో ఇప్పటి వరకు ప్రయత్నించని డి4 గడి నుంచి ఓపెనింగ్‌ చేసిన దివ్య ఎత్తులు, చకచకా పావులు కదుపుతున్న తీరు ఆమె ఫైనల్‌ కోసం బాగా సన్నద్ధమైందనిపించింది. హంపిని ఒత్తిడికి గురి చేసేందుకు ఎత్తులకు పదునుపెట్టే క్రమంలో చాలా సమయం తీసుకుంది. మరో వైపు అనుభవజు్ఞరాలైన హంపి ఆరంభంలో ప్రత్యర్థి చురుకైన ఎత్తులకు ఏమాత్రం కంగారు పడకుండా తన గేమ్‌ ప్లాన్‌ను అమలు చేసింది. 

ఈ క్రమంలో ఆరంభంలో కాస్త ఇబ్బందులు ఎదురైనప్పటికీ ఒత్తిడికి గురి కాలేదు. గేమ్‌ మధ్యలో పట్టు చిక్కించుకున్న హంపి... దివ్య జోరును అడ్డుకుంది. ఈ సమయంలో దివ్య గెలుస్తానన్న ధీమాతో డ్రాకు అంగీకరించలేదు. చివరకు గేమ్‌ సాగే కొద్దీ ఫలితంపై ఆశలు లేకపోవడంతో దాదాపు మూడు గంటలపాటు జరిగిన ఈ గేమ్‌ 41వ ఎత్తుల్లో డ్రా అయ్యింది. ఫైనల్‌లో భాగంగా నేడు రెండో గేమ్‌ జరుగుతుంది. ఇందులో గెలిచినవారు ప్రపంచ విజేతగా నిలుస్తారు. ఒకవేళ ఫలితం రాకపోతే రేపు టైబ్రేక్‌ ద్వారా చాంపియన్‌ను తేలుస్తారు.   

Videos

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)