Breaking News

CG 2026: వర్షంలోనూ తగ్గని జోరు.. ఆఖరి క్షణాల్లో అద్భుతం

Published on Wed, 07/29/2026 - 07:23

గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్‌వెల్త్ గేమ్స్‌-2026లో భారత అథ్లెట్స్‌ ప‌త‌కాల పంట పండిస్తున్నారు. తాజాగా భారత లాంగ్ డిస్టెన్స్ రన్నర్ గుల్వీర్ సింగ్ చారిత్రాత్మక విజయం సాధించాడు. పురుషుల 10,000 మీటర్ల పరుగు పందెంలో అతడు రజత పతకాన్ని సొంతం చేసుకున్నాడు. దీంతో కామన్వెల్త్ క్రీడల్లో ఈ విభాగంలో పతకం గెలుచుకున్న తొలి భారత పురుష అథ్లెట్‌గా రికార్డులకెక్కాడు.

ఆఖరి క్షణాల్లో అద్భుతం
ఉత్కంఠభరితంగా సాగిన ఈ రేసులో 28 ఏళ్ల గుల్వీర్ ఆఖరి క్షణాల్లో అద్భుతం చేశాడు. చివరి ల్యాప్‌లో అనూహ్యమైన వేగంతో ముందుకు దూసుకెళ్లిన గుల్వీర్.. 27 నిమిషాల 49.78 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని రెండో స్థానంలో నిలిచాడు. ఆస్ట్రేలియాకు చెందిన కై రాబిన్సన్ (27:48.93) స్వర్ణ పతకం సాధించగా.. ఐల్ ఆఫ్ మ్యాన్‌కు చెందిన డేవిడ్ ముల్లార్కే కాంస్య పతకం ఒడిసి పట్టాడు.

వర్షంలోనూ తగ్గని జోరు
కాగా స్కాట్‌స్టౌన్ స్టేడియంలో ఈ  పరుగు పందం తీవ్ర ప్రతికూల వాతావరణంలో జరిగింది. రేసు సమయంలో భారీ వర్షం కురిసింది. నీటితో ట్రాక్ తడిసిపోయింది. అయినప్పటికి గుల్వీర్ తన పట్టుదలను వీడలేదు. మొదటి నుంచీ అగ్రస్థానంలో ఉన్న అథ్లెట్ల గుంపుతోనే సాగుతూ టాప్‌-2లో నిలిచాడు. 

అయితే ఈ విభాగంలో ఎప్పుడూ ఆధిపత్యం చెలాయించే కెన్యా, ఉగాండా అథ్లెట్లకు ఈసారి పతకాలు దక్కకపోవడం విశేషం. 1986 కామన్వెల్త్ గేమ్స్ తర్వాత పురుషుల 10,000 మీటర్ల విభాగంలో ఒక్క ఆఫ్రికన్ అథ్లెట్ కూడా పతకం గెలవకపోవడం ఇదే మొదటిసారి. కాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన గుల్వీర్ సింగ్ ప్రస్తుతం ఇండియన్‌ ఆర్మీలోని గ్రెనేడియర్స్ రెజిమెంట్‌లో నాయిబ్ సుబేదార్‌గా పనిచేస్తున్నాడు. 

మ‌రోవైపు భార‌త‌ వెయిట్‌ లిఫ్ట‌ర్ హర్జిందర్ కౌర్‌ సైతం స‌త్తాచాటింది. మహిళల 69 కేజీల విభాగంలో మొత్తం 227 కేజీల (స్నాచ్‌లో 101 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 126 కేజీలు) బరువును ఎత్తి సిల్వ‌ర్ మెడ‌ల్ సొంతం చేసుకుంది. దీంతో ఈ క్రీడల్లో భార‌త ప‌త‌కాలు సంఖ్య 12కు చేరింది.
 

Videos

సచివాలయ ఉద్యోగులంటే చంద్రబాబుకు ఎందుకింత కక్ష..?

పెళ్లి చూసుకున్నవాళ్లకే దిక్కులేదు... 15 ఏళ్ళు కలిసుంటారట..!

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

ఓ బ్రాహ్మణ్ పై కక్ష్య సాధిస్తే... వేమిరెడ్డి దంపతులు ఇది నా ఆక్రందన! శ్రావణ్ శర్మ సతీమణి

సచివాలయం ఉద్యోగులను ఎలా ఈడ్చుకెళ్తున్నారో చూడండి

ఈసీ నియామక విధానంపై జగన్ ప్రశ్నలు.. అసలు వివాదం ఏంటి?

పాత అంబులెన్సుకు కొత్త రంగులు వేసిన ఏపీ సర్కారు

సిగ్గుందా చంద్రబాబు..! ఉద్యోగులంటే బానిసలనుకున్నారా..?

పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. నెలకు అకౌంట్లోకి 20,000

హిమాలయాల్లో పెను సునామీ! 200 కోట్ల మందికి డేంజర్ బెల్స్!

Photos

+5

AP: సచివాలయ ఉద్యోగుల తిరుగుబాటు..!(ఫొటోలు)

+5

ఎర్రచీరలో అందంగా శోభిత చెల్లి సమంత (ఫొటోలు)

+5

'ఆదర్శ కుటుంబం'లోని నారాయణమ్మ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

భర్తతో కలిసి మలేసియా ట్రిప్‌లో హీరోయిన్ అపర్ణ(ఫొటోలు)

+5

'ప్యారడైజ్'లో కేసీఆర్‌ని పోలిన పాత్ర.. షూటింగ్‌లో ఇలా(ఫొటోలు)

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)