Breaking News

చరిత్ర సృష్టించిన గుల్వీర్ సింగ్.. తొలి భారత అథ్లెట్‌గా

Published on Sun, 08/02/2026 - 07:40

గ్లాస్కో వేదిక‌గా జ‌రుగుతున్న కామ‌న్‌వెల్త్ గేమ్స్‌-2026లో భార‌త ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ గుల్వీర్ సింగ్ అద‌ర‌గొట్టాడు.  తొలుత  జూలై 28న జరిగిన 10,000 మీటర్ల విభాగంలో రజతం (సిల్వర్) గెలుచుకున్న గుల్వీర్.. తాజాగా శ‌నివారం  5000 మీటర్ల పరుగు పందెంలో కాంస్య ప‌త‌కం కైవ‌సం చేసుకున్నాడు.

రేసును గుల్వీర్ 13 నిమిషాల 24.95 సెకన్లలో ముగించి ఈ బ్రాంజ్ మెడ‌ల్‌ను ఒడిసి పట్టాడు. త‌ద్వారా ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు చెందిన గుల్వీర్ ప‌లు అరుదైన రికార్డుల‌ను త‌న పేరిట లిఖించుకున్నాడు. కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలోనే 5000 మీటర్ల పరుగు పందెంలో పతకం సాధించిన తొలి భార‌త అథ్లెట్‌గా గుల్వీర్ రికార్డుల‌కెక్కాడు. అంతేకాకుండా కామన్వెల్త్ గేమ్స్ ఒకే ఎడిషన్‌లో భార‌త్ త‌ర‌పున‌ రెండు పతకాలు సాధించిన మొదటి ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్‌గా కూడా అత‌డు చ‌రిత్ర సృష్టించాడు.

గుల్వీర్ సింగ్ ట్రాక్ రికార్డ్
28 ఏళ్ల గుల్వీర్ సింగ్ అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది.  5000 మీటర్లు (12:59.77),  10,000 మీటర్లు రెండింటిలోనూ జాతీయ రికార్డులు కలిగి ఉన్నాడు. అంతకుముందు చైనా వేదికగా జరిగిన ఆసియాక్రీడలు-2023లోనూ అతడు 10,000 మీటర్ల విభాగంలో కాంస్య పతకం సాధించాడు. గుల్వీర్ సింగ్ ప్రస్తుతం ఇండియన్‌ ఆర్మీలోని గ్రెనేడియర్స్ రెజిమెంట్‌లో నాయిబ్ సుబేదార్‌గా పనిచేస్తున్నాడు.

Videos

సచివాలయ ఉద్యోగులంటే చంద్రబాబుకు ఎందుకింత కక్ష..?

పెళ్లి చూసుకున్నవాళ్లకే దిక్కులేదు... 15 ఏళ్ళు కలిసుంటారట..!

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

ఓ బ్రాహ్మణ్ పై కక్ష్య సాధిస్తే... వేమిరెడ్డి దంపతులు ఇది నా ఆక్రందన! శ్రావణ్ శర్మ సతీమణి

సచివాలయం ఉద్యోగులను ఎలా ఈడ్చుకెళ్తున్నారో చూడండి

ఈసీ నియామక విధానంపై జగన్ ప్రశ్నలు.. అసలు వివాదం ఏంటి?

పాత అంబులెన్సుకు కొత్త రంగులు వేసిన ఏపీ సర్కారు

సిగ్గుందా చంద్రబాబు..! ఉద్యోగులంటే బానిసలనుకున్నారా..?

పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. నెలకు అకౌంట్లోకి 20,000

హిమాలయాల్లో పెను సునామీ! 200 కోట్ల మందికి డేంజర్ బెల్స్!

Photos

+5

AP: సచివాలయ ఉద్యోగుల తిరుగుబాటు..!(ఫొటోలు)

+5

ఎర్రచీరలో అందంగా శోభిత చెల్లి సమంత (ఫొటోలు)

+5

'ఆదర్శ కుటుంబం'లోని నారాయణమ్మ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

భర్తతో కలిసి మలేసియా ట్రిప్‌లో హీరోయిన్ అపర్ణ(ఫొటోలు)

+5

'ప్యారడైజ్'లో కేసీఆర్‌ని పోలిన పాత్ర.. షూటింగ్‌లో ఇలా(ఫొటోలు)

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)