టూ టైమ్‌ విన్నింగ్‌ కోచ్‌తో ఒప్పందం చేసుకున్న గుజరాత్‌

Published on Wed, 03/11/2026 - 21:37

తమ తొలి సీజన్‌లోనే (2022) టైటిల్‌ ఎగరేసుకుపోయి సంచలనం సృష్టించిన గుజరాత్‌ టైటాన్స్‌ ఫ్రాంచైజీ మళ్లీ సక్సెస్‌ బాట పట్టేందుకు కీలక అడుగు ముందుకేసింది. ఇందులో భాగంగా టూ టైమ్‌ విన్నింగ్‌ కోచ్‌ విజయ్‌ దాహియాతో ఒప్పందం చేసుకుంది. 

రానున్న సీజన్‌ కోసం అతన్ని అసిస్టెంట్‌ కోచ్‌గా నియమించుకుంది. దాహియా ఇటీవలే నియమితుడైన హెడ్‌ కోచ్‌ మాథ్యూ హేడెన్‌కు డిప్యూటీగా వ్యవహరిస్తాడు. దాహియా 2012, 2014లో కేకేఆర్‌ టైటిల్‌ గెలిచినప్పుడు ఆ బృందంలో అసిస్టెంట్‌ కోచ్‌గా ఉన్నాడు. 

దాహియా తన ఐపీఎల్‌ కెరీర్‌లో కేకేఆర్‌తో పాటు ఢిల్లీ క్యాపిటల్స్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌కు కూడా పని చేశాడు. అతని కోచింగ్‌లో ఢిల్లీ జట్టు 2007-08 సీజన్‌లో రంజీ ట్రోఫీ గెలిచింది. ఈ అనుభవం గుజరాత్ టైటాన్స్‌కి కొత్త ఉత్సాహాన్ని తీసుకురావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.  

కాగా, హార్దిక్‌ పాండ్యా సారథ్యంలో తొలి సీజన్‌లోనే టైటిల్‌ గెలిచిన గుజరాత్‌.. ఆతర్వాత సీజన్‌లో కూడా ఫైనల్‌కు చేరినా, సీఎస్‌కే చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. 2024లో హార్దిక్‌ పాండ్యా ఆ ఫ్రాంచైజీని వీడి ముంబై ఇండియన్స్‌లో చేరడంతో శుభ్‌మన్‌ గిల్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. 

గిల్‌ సారథ్యంలో గుజరాత్‌ తొలి సీజన్‌లో ఎనిమిదో స్థానంలో నిలిచింది. గత సీజన్‌లో ఆ జట్టు మూడో స్థానంలో నిలిచినా ఫైనల్స్‌కు చేరలేకపోయింది. రాబోయే సీజన్‌లో మరోసారి గిల్‌ నేతృత్వంలో గుజ.రాత్‌ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.

ఇదిలా ఉంటే, 2026 సీజన్‌కు సంబంధించి తొలి విడత షెడ్యూల్‌ (20 మ్యాచ్‌లు) ఇవాళే విడుదలైంది. గుజరాత్‌ తమ తొలి మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌తో తలపడనుంది. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో (మార్చి 28) ఆర్సీబీ-ఎస్‌ఆర్‌హెచ్‌ పోటీపడనున్నాయి. తొలి విడతలో ప్రతి జట్టు తలో నాలుగు మ్యాచ్‌లు ఆడనుంది.

గుజరాత్‌ టైటాన్స్‌ తొలి విడత షెడ్యూల్‌..  
- మార్చి 31: GT vs PBKS 
- ఏప్రిల్‌ 4: GT vs RR  
- ఏప్రిల్‌ 8: GT vs DC  
- ఏప్రిల్‌ 12: GT vs LSG  

  • దేశంలో పలు రాష్ట్రాల్లో ఎన్నికల దృష్ట్యా షెడ్యూల్‌ను విడతల వారీగా ప్రకటిస్తామని బీసీసీఐ ముందే చెప్పిన విషయం తెలిసిందే.

 

 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)