Breaking News

శుబ్‌మన్‌ గిల్‌కు షాక్‌.. గుజరాత్‌ సీఐడీ సమన్లు!?

Published on Thu, 01/02/2025 - 13:40

బీజడ్‌ ఫైనాన్షియల్ సర్వీసెస్ కుంభకోణం కేసులో నలుగురు భార‌త క్రికెట‌ర్లకు గుజరాత్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (సీఐడీ) స‌మ‌న్లు పంపింది. వారిలో టీమిండియా ప్లేయ‌ర్లు శుబ్‌మ‌న్ గిల్‌, సాయిసుదర్శ‌న్‌, మొహిత్ శ‌ర్మ‌, రాహుల్‌ తెవాటియా ఉన్నారు. వీరు న‌లుగురూ ఆ సంస్థ‌లో పెట్టుబ‌డులు పెట్టినందుకు గుజ‌రాత్ సిఐడి స‌మ‌న్లు పంపింది. త్వరలోనే విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొంది.

అహ్మదాబాద్ మిర్రర్ కథనం ప్రకారం.. ఆ కంపెనీలో గిల్‌ రూ.1.95 కోట్లు పెట్టుబడి పెట్టిన‌ట్లు తెలుస్తోంది. మిగతా ముగ్గురు గుజ‌రాత్ టైటాన్స్ ప్లేయర్లు రూ. 10 ల‌క్ష‌ల నుంచి కోటి మ‌ధ్య ఇన్వెస్ట్ చేసిన‌ట్లు స‌మాచారం. కాగా శుబ్‌మ‌న్ గిల్ ప్ర‌స్తుతం ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌లో ఉన్నాడు. బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీ 2024-25 ముగిసిన అనంత‌రం గిల్ విచార‌ణ‌కు హాజ‌రు కానున్నాడు. అయితే మిగితా ముగ్గురు ఆట‌గాళ్లు భార‌త్‌లోనే ఉండ‌డంతో గిల్‌ కంటే ముందు విచార‌ణ‌కు హాజ‌రు అయ్యే అవ‌కాశ‌ముంది.

ఏంటీ బీజ‌డ్ గ్రూపు స్కామ్‌?
గుజ‌రాత్‌లోని హిమ్మత్‌నగర్ చెందిన భూపేంద్రసిన్హ్ జాలా.. బీజడ్‌ ఫైనాన్షియల్ సర్వీసెస్, బీజ‌డ్ ట్రేడర్స్ కంపెనీల‌ను స్దాపించాడు. ఈ సంస్థ‌ల‌కు సంబంధించిన కార్యాల‌యాల‌ను గుజ‌రాత్‌లోని ప‌లు జిల్లాల్లో విస్తరించాడు. ఈ కంపెనీల‌లో పెట్టుబ‌డి పెడితే బ్యాంకుల కంటే మెరుగైన వడ్డీ రేటును చెల్లిస్తామని ప్ర‌జ‌ల‌ను న‌మ్మించారు.

అంతేకాకుండా బహుమతులను ప్ర‌క‌టించి పెట్టుబడిదారులను భారీగా ఆకర్షించారు. ఉదాహరణకు వారి కంపెనీలో రూ. 5 లక్షల పెట్టుబడి పెడితే 32 ఇంచ్‌ టీవీ, రూ.10 లక్షల పెట్టుబడి పెడితే గోవా ట్రిప్స్‌ వంటి గిప్ట్‌ ప్యాకేజిలను బీజడ్‌ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆఫ‌ర్ చేసింది. 

దీంతో ప్ర‌జ‌లు భారీగా పెట్టుబ‌డులు పెట్టారు. అయితే వారు ఇచ్చిన హామీలు అన్ని బూటకమని, మోసపోయాయని తెలుసుకున్న ప్రజలు పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఫోర్జరీ కేసు నమోదు చేసిన పోలీసులు బీజడ్‌ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీఈవో భూపేంద్రసిన్హ్ జాలాను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆ కేసును సిఐడీ అప్పగించారు.

తొలుత భూపేంద్రసిన్హ్ రూ. 6000 కోట్ల చిట్-ఫండ్ మోసానికి పాల్పడ్డారని నివేదించిన గుజ‌రాత్ సీఐడీ.. ఆ త‌ర్వాత ఆ మొత్తాన్ని రూ. 450 కోట్లగా ఖారారు చేసింది. అయితే పోలీసుల విచారణలో గిల్‌, సాయిసుదర్శ‌న్‌, మొహిత్ శ‌ర్మ‌, తెవాటియా సైతం పెట్టుబడులు పెట్టినట్లు తేలింది. ఈ క్రమంలోనే ఈ నలుగురుకు సిఐడి సమన్లు పంపింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)