Breaking News

గుజరాత్ టైటాన్స్ కోచ్‌గా ఆసీస్ క్రికెట్‌ దిగ్గజం

Published on Tue, 03/10/2026 - 13:07

ఐపీఎల్‌-2026 సీజన్‌కు ముందు గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్ట్రేలియా దిగ్గజ ఓపెనర్ మాథ్యూ హేడెన్‌ను తమ జట్టు కొత్త బ్యాటింగ్ కోచ్‌గా నియమిస్తున్నట్లు గుజరాత్ ప్రకటించింది. వరల్డ్‌కప్ విన్నర్‌, డేంజరస్ ప్లేయర్‌ హేడెన్ రాకతో టైటాన్స్ బ్యాటింగ్ విభాగం మరింత బలోపేతం కానుంది.

"మా ప్రయాణంలో మాథ్యూ హేడెన్ నియామకం ఒక కీలకమైన ఘట్టం. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మాథ్యూను మా బ్యాటింగ్ కోచ్‌గా నియమించాము. యువ ఆటగాళ్లకు మార్గనిర్దేశం చేయడంలో అతడి అనుభవం మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది" గుజరాత్ టైటాన్స్ క్రికెట్ డైరెక్టర్ విక్రమ్ సోలంకి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ విధ్వంసకర బ్యాటర్ గుజరాత్ హెడ్ కోచ్‌ ఆశిష్ నెహ్రా, పార్థివ్ పటేల్‌లతో కలిసి పనిచేయనున్నాడు. హేడన్ గతంలో 2021 టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ బ్యాటింగ్  కన్సల్టెంట్‌గా పనిచేశాడు. కానీ పూర్తి స్ధాయిలో ఎప్పుడు కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించలేదు. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకున్న హేడెన్‌.. ఐపీఎల్‌లో కూడా తన మార్క్‌ను చూపించాడు.

హేడెన్  చెన్నై సూపర్ కింగ్స్ తరఫున 32 మ్యాచ్‌లు ఆడారు. 2010లో టీమ్ ని టైటిల్ గెలిపించగా, 2009లో 12 మ్యాచ్‌ల్లో 572 రన్స్ చేసి ఆరెంజ్ కాప్‌ను కూడా సొంతం చేసుకున్నాడు. పవర్ ప్లే ఓవర్లలో విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆట తీరునే మార్చేసిన హేడెన్, ఇప్పుడు కోచ్‌గా గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లకు ఎలాంటి శిక్షణ ఇస్తారో చూడాలి. మార్చి 28 నుంచి ఈ క్యాష్ రిచ్ లీగ్ ప్రారంభం కానుంది.
చదవండి: Teamindia: బీసీసీఐ భారీ న‌జ‌రానా.. ఎన్ని కోట్లు తెలిస్తే షాకవ్వాల్సిందే?

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)