మోటీ మాయాజాలం.. ఫైనల్లో గయానా అమెజాన్‌ వారియర్స్‌

Published on Thu, 09/18/2025 - 16:41

ఇమ్రాన్‌ తాహిర్‌ నేతృత్వంలోని గయానా అమెజాన్‌ వారియర్స్‌ కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2025 ఎడిషన్‌ ఫైనల్స్‌కు చేరింది. భారతకాలమానం ప్రకారం ఇవాళ (సెప్టెంబర్‌ 18) ఉదయం జరిగిన తొలి క్వాలిఫయర్‌లో ఆ జట్టు సెయింట్‌ లూసియా కింగ్స్‌పై 14 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొందింది.

తొలుత బ్యాటింగ్‌ చేసిన గయానా.. తబ్రేజ్‌ షంషి (4-0-33-3), డేవిడ్‌ వీస్‌ (3-0-14-2), అల్జరీ జోసఫ్‌ (3-0-34-2), తైమాల్‌ మిల్స్‌ (3.5-0-38-2), రోస్టన్‌ ఛేజ్‌ (2-0-15-1) ధాటికి 19.5 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌటైంది. 

గయానా ఇన్నింగ్స్‌లో బెన్‌ మెక్‌డెర్మాట్‌ (34), షాయ్‌ హెప్‌ (32) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. ఆఖర్లో రొమారియో షెపర్డ్‌ (8 బంతుల్లో 21; 2 ఫోర్లు, సిక్స్‌), ప్రిటోరియస్‌ (8 బంతుల్లో 17; 2 ఫోర్లు, సిక్స్‌) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడటంతో గయానా గౌరవప్రదమైన స్కోర్‌ చేయగలిగింది.

మోటీ మాయాజాలం
అనంతరం 158 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన లూసియా కింగ్స్‌.. గుడకేశ్‌ మోటీ మాయాజాలం (4-0-30-4) దెబ్బకు 19.1 ఓవర్లలో 143 పరుగులకే చాపచుట్టేసింది. ఇమ్రాన్‌ తాహిర్‌ (4-0-22-2), ప్రిటోరియస్‌ (4-0-24-2), రొమారియో షెపర్డ్‌ (4-0-36-1), హస్సన్‌ ఖాన్‌ (2.1-0-21-1) కూడా లూసియా కింగ్స్‌ను డ్యామేజ్‌ చేశారు.

గయానా బౌలర్ల ధాటికి ఓ దశలో లూసియా కింగ్స్‌ ఇన్నింగ్స్‌ 100లోపే ముగుస్తుందని అనుకున్నారు. అయితే ఖారీ పియెర్‌ (29 బంతుల్లో 50; 3 ఫోర్లు, 5 సిక్సర్లు), తైమాల్‌ మిల్స్‌ (18 బంతుల్లో 30; 4 ఫోర్లు, సిక్స్‌) వీరోచితంగా పోరాడి గాయానా శిబిరంలో ఓటమి భయం పుట్టించారు. మోటీ పియెర్‌ను.. హస్సన్‌ ఖాన్‌ మిల్స్‌ను ఔట్‌ చేయడంతో లూసియా కింగ్స్‌ పోరాటం ముగిసింది.

ఈ మ్యాచ్‌లో ఓడినా లూసియా కింగ్స్‌కు టైటిల్‌ రేసులో ఉండేందుకు మరో అవకాశం ఉంటుంది. సెప్టెంబర్‌ 20న జరిగే క్వాలిఫయర్‌-2లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సెప్టెంబర్‌ 22న జరిగే ఫైనల్లో గయానాతో అమీతుమీ తేల్చుకుంటుంది.

 

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)