రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..
Breaking News
సీజేపీ నేతలకు మరోసారి షాక్
పోలీసులే అల్లరి మూకల్లా వ్యవహరిస్తే ఎలా?: సజ్జల
టైగర్ ష్రాఫ్ కాల్పులు : పోలీసుల కీలక ప్రకటన
స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలపై సుప్రీంకోర్టుకు వైఎస్సార్సీపీ
టీవీకేకు రూ.13.3 కోట్ల విరాళాలు, 99 శాతం ఆ ఇద్దరి నుంచే!
96 చోట్ల హింసాత్మక ఘటనలు: లేళ్ల అప్పిరెడ్డి
తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ విజయదశమి శుభాకాంక్షలు
దీపావళి యాడ్ వివాదం : జర్నలిస్టును కొట్టి చంపేశారు!
మణిపూర్‌లో మళ్లీ హింస: ఒకరు మృతి, పలువురికి గాయాలు
నోబెల్ గ్రహీతను అభినందించరా?.. కేంద్రంపై శశి థరూర్ గుర్రు!
బోనస్ వస్తోందోచ్.. పోస్టాఫీసు ఉద్యోగులకు ‘పండగే’!
ఏపీలో ఎంపీటీసీ,జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు: ముగ్గురు అనుమానితుల అరెస్ట్
బరితెగించిన పచ్చమూకలు.. వంతపాడిన పోలీసులు!
ఇప్పుడు బంగారం కొనాలంటే.. ఎంత కావాలి?
ప్రభుత్వం గాడి తప్పితేనే ‘టైగర్’ లాంటి ఘటనలు: దిప్కే
చెన్నైలో భారీ వర్షాలు: యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్న సీఎం విజయ్!
Stock Market Updates: నష్టాల్లో బ్యాంకు, ఐటీ షేర్లు
రైల్లో ఫోన్ స్పీకర్ ఆన్ చేస్తే జైలుకే..
Saudi: భారత పౌరులకు భద్రతా హెచ్చరికలు
GT VS RR: హార్ధిక్ పాండ్యా అరుదైన రికార్డు.. రాజస్థాన్ రాయల్స్ చెత్త రికార్డు
Published on Mon, 04/17/2023 - 12:44
ఐపీఎల్-2023లో భాగంగా గుజరాత్ టైటాన్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య నిన్న (ఏప్రిల్ 16, రాత్రి 7:30 గంటలకు) జరిగిన మ్యాచ్‌లో పలు అరుదైన రికార్డులు నమోదయ్యాయి. ఈ మ్యాచ్‌లో షిమ్రోన్ హెట్‌మైర్ (26 బంతుల్లో 56 నాటౌట్; 2 ఫోర్లు, 5 సిక్సర్లు), సంజూ శాంసన్ (32 బంతుల్లో 60; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడటంతో రాజస్థాన్ రాయల్స్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. శుభ్‌మన్ గిల్ (45), మిల్లర్ (46) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేయగా.. రాజస్థాన్ సైతం 7 వికెట్లు కోల్పోయి 19.2 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది.
కాగా, ఈ మ్యాచ్ పలు ఆసక్తికర గణాంకాలకు వేదికైంది. అవేంటంటే..
- ఈ మ్యాచ్‌లో గుజరాత్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా 2000 ఐపీఎల్ పరుగుల మార్కును అధిగమించాడు. ఈ క్రమంలో అతను ఐపీఎల్‌లో 2000 పరుగులు పూర్తి చేసి 50 వికెట్లు పడగొట్టిన ఆరో క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు.
- ఈ మ్యాచ్‌లో మెరుపు హాఫ్ సెంచరీ చేసిన షిమ్రోన్ హెటమైర్ ఐపీఎల్‌లో ఐదో అత్యుత్తమ బ్యాటింగ్ స్ట్రయిక్ రేట్ (157.20) కలిగిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు (కనీసం 500 పరుగులు చేసిన ఆటగాళ్లలో). ఈ విభాగంలో ఆండ్రీ రసెల్ (177.09) అగ్రస్థానంలో ఉన్నాడు.
- ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చెత్త రికార్డు నమోదు చేసింది. ప్రస్తుత సీజన్‌లో పవర్ ప్లేలో అత్యల్ప స్కోర్ (26/2) నమోదు చేసిన జట్టుగా చెత్త రికార్డు మూటగట్టుకుంది.
- ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌పై రాజస్థాన్ రాయల్స్‌కు ఇది మొట్టమొదటి విజయం. గతంలో (2002 సీజన్) ఈ ఇరు జట్లు తలపడిన 3 సందర్భాల్లో గుజరాత్‌నే విజయం వరించింది.
#
Tags : 1