Breaking News

భారత్‌-బంగ్లా రెండో టెస్టు.. వాతావరణం ఎలా ఉందంటే?

Published on Fri, 09/27/2024 - 07:51

కాన్పూర్ వేదిక‌గా  భార‌త్‌-బంగ్లాదేశ్ రెండో టెస్టు మ‌రి కొన్ని గంట‌ల్లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం తీవ్రంగా శ్ర‌మించిన ఇరు జ‌ట్లు గెలుపుపై థీమాగా ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాల‌ని రోహిత్ సేన భావిస్తుంటే.. మ‌రోవైపు భార‌త గ‌డ్డ‌పై తొలి టెస్టు విజ‌యం సాధించాల‌ని బంగ్లా ప‌ట్టుదల‌తో ఉంది. 

కాగా  దాదాపు మూడేళ్ల కాన్పూర్ గ్రీన్ పార్క్ స్టేడియంలో టీమిండియా టెస్టు మ్యాచ్ ఆడ‌నుంది. చివ‌ర‌గా 2021లో న్యూజిలాండ్‌తో భార‌త్ ఆడింది. ఆ టెస్టు మ్యాచ్ డ్రా ముగిసింది. ఈ క్ర‌మంలో  కాన్పూర్‌ పిచ్, వాతావ‌ర‌ణం ఎలా వుందో ఓ లుక్కేద్దాం.

పిచ్, వాతావరణం
చెన్నై పిచ్‌తో పోల్చుకుంటే కాన్పూర్‌ పిచ్‌ మందకొడిగా ఉండనుంది. నల్లమట్టితో రూపొందించిన పిచ్‌పై బంతి ఆగి వస్తుంది. స్పిన్న‌ర్లు ఈ వికెట్‌పై చెల‌రేగే అవ‌కాశ‌ముంది. ఇక ఉక్కపోత అధికంగా ఉండనుంది. మ్యాచ్‌కు తొలి రోజు, మూడో రోజు వర్షం ముప్పు పొంచి ఉండగా... వెలుతురు లేమి కారణంగా ఆటకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. 

అయితే గురువారం రాత్రి కాన్పూర్‌లో ఓ మోస్తారు వ‌ర్షం కురిసిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం మ్యాచ్ జ‌రిగే వేదిక వ‌ద్ద వ‌ర్షం లేక‌పోయిన‌ప్ప‌ట‌కి... ఆట మ‌ధ్య‌లో అంత‌రాయం క‌లిగించే ఛాన్స్ ఉంది. అయితే ఆఖ‌రి రెండు రోజుల ఆట‌కు ఎటువంటి వ‌ర్షం ముప్పు లేదు.

తుది జట్లు (అంచనా) 
భారత్‌: రోహిత్‌ శర్మ (కెప్టెన్ ), యశస్వి జైస్వాల్, శుబ్‌మన్‌ గిల్, విరాట్‌ కోహ్లి,  పంత్, కేఎల్‌ రాహుల్, రవీంద్ర జడేజా, అశ్విన్, కుల్దీప్‌/అక్షర్, బుమ్రా, సిరాజ్‌.

బంగ్లాదేశ్‌: నజు్మల్‌ (కెప్టెన్ ), షాద్‌మన్, జాకీర్, మోమినుల్, ముషి్ఫకర్, షకీబ్, లిటన్‌ దాస్, మెహిది హసన్, తైజుల్, హసన్‌ మహమూద్, తస్కీన్‌ అహ్మద్‌.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)