Breaking News

జనసంద్రగా మారిన బెంగళూరు.. ఐపీఎల్‌ విజేత ఆర్సీబీకి ఘన స్వాగతం

Published on Wed, 06/04/2025 - 16:23

బెంగళూరు నగర వీధుల జనసంద్రంగా మారాయి. ఐపీఎల్‌ 2025 టైటిల్‌ గెలిచాక రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు ఇవాళ మధ్యాహ్నం నగరానికి చేరుకుంది. ఎయిర్‌పోర్ట్‌లో ఆర్సీబీ సభ్యులకు ఘన స్వాగతం​ లభించింది. స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి సహా ఆర్సీబీ బృంద సభ్యులంతా ప్రత్యేక బస్సులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యను కలిసేందుకు బయల్దేరారు. ఆ రాష్ట్ర అసెంబ్లీ 'విధాన సౌధ' ముందు సిద్దరామయ్య చేతుల మీదుగా ఆర్సీబీ సభ్యులకు సన్మానం జరుగనుంది. 

విధాన సౌధకు వెళ్లే దారిలో ఆర్సీబీ అభిమానులు ఇసుకేస్తే రాలనంతగా ఉన్నారు. ఆర్సీబీ సభ్యులు ప్రయాణిస్తున్న వాహనంపై పూల వర్షం కురుస్తుంది. ఆర్సీబీ, విరాట్‌ కోహ్లి నామస్మరణతో బెంగళూరు నగర వీధులు మార్మోగిపోతున్నాయి. ఆర్సీబీ బృంద సభ్యులు ప్రయాణిస్తున్న బస్సులో విరాట్‌ కోహ్లి ముందు కూర్చుకున్నాడు. విరాట్‌ బస్సు అద్దాల గుండా అభిమానులకు అభివాదం చేస్తున్నాడు. విరాట్‌ తన భార్య అనుష్కతో పాటు ఉన్నాడు.

ప్రస్తుతమున్న సమాచారం మేరకు ఓపెన్‌ టాప్‌ బస్సులో విక్టరీ పరేడ్‌ జరగడం లేదు. ముఖ్యమంత్రి సిద్దరామయ్యను కలిసిన తర్వాత పోలీసులు విక్టరీ పరేడ్‌కు అనుమతిచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇదలా ఉంచితే, సాయంత్రం  5 గంటల నుంచి 6 గంటల మధ్యలో చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ ఆటగాళ్ల సత్కార కార్యక్రమం జరుగనుంది. టికెట్‌, పాస్‌ ఉన్న వారికి మాత్రమే స్టేడియంలోకి అనుమతి ఉంటుందని పోలీసులు చెప్పారు.

విరాట్‌ బృందానికి వెల్‌కమ్‌ చెప్పిన కర్ణాటక​ డీసీఎం
బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో ఆర్సీబీ బృంద సభ్యులకు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి (డీసీఎం) డీకే శివకుమార్‌ ఘన స్వాగత​ం పలికాడు. డీకే విరాట్‌ కోహ్లికి ప్రత్యేకంగా పూలు ఇచ్చి స్వాగతం పలికాడు. డీకే విరాట్‌ను ఆర్సీబీ జెండాతో పాటు కర్ణాటక జెండా పట్టుకోవాల్సిందిగా కోరాడు.   

#

Tags : 1

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)