Breaking News

ఈ ఏడాది ఐసీసీ ట్రోఫీ సాధిస్తాం.. దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్‌ గ్రేమ్‌ స్మిత్‌ ధీమా

Published on Wed, 02/12/2025 - 08:22

జొహన్నెస్‌బర్గ్‌: అంతర్జాతీయ క్రికెట్‌లో దక్షిణాఫ్రికా ఘనాపాఠి అయినా... ఐసీసీ ట్రోఫీల వెలతి మాత్రం ఆ జట్టును వేధిస్తోంది. అయితే ఈ ఏడాది సుదీర్ఘ నిరీక్షణకు తమ జట్టు తెరవేస్తుందని సఫారీ జట్టు మాజీ కెప్టెన్‌ గ్రేమ్‌ స్మిత్‌ ధీమా వ్యక్తం చేశాడు. వచ్చే వారం ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ పాక్‌లో మొదలుకానుంది. జూన్‌లో ఆ్రస్టేలియాతో జరిగే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్స్‌కు ఇదివరకే దక్షిణాఫ్రికా అర్హత సాధించింది. 

ఈ రెండు టోర్నీలు జరుగనున్న నేపథ్యంలో స్మిత్‌ తమ జట్టు ఈ ఏడాది ఐసీసీ ట్రోఫీ చేజిక్కించుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ముంబై ఇండియన్స్‌ ఫ్రాంచైజీ గెలుచుకున్న ‘ఎస్‌ఏటి20’ టోర్నీకి కమిషనర్‌గా వ్యవహరించిన స్మిత్‌ తమ జట్టు ప్రదర్శనపై గంపెడాశలు పెట్టుకున్నాడు. 

‘2027లో సఫారీ ఆతిథ్యమివ్వబోయే వన్డే ప్రపంచకప్‌కు ముందే ఈ ఏడాది ఐసీసీ ట్రోఫీ లోటును భర్తీ చేసుకుంటాం. చాంపియన్స్‌ ట్రోఫీ, డబ్ల్యూటీసీలను గెలుచుకుంటే రెట్టించిన ఉత్సాహంతో సొంతగడ్డపై ప్రపంచకప్‌ ఆడేందుకు ఊతమిస్తుంది’ అని అన్నాడు. తదుపరి రెండేళ్లలో తమ దేశంలో స్టేడియాల నవీకరణ, పిచ్‌ల స్థాయి పెంచే పనులు జరుగుతాయని, దీంతో తదుపరి వన్డే మెగా ఈవెంట్‌ (2027)లో సొంత ప్రేక్షకుల మధ్య హాట్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతామని చెప్పాడు.  

గతేడాది జరిగిన పురుషుల, మహిళల టి20 ప్రపంచకప్‌లలో దక్షిణాఫ్రికా షరామామూలుగా ఫైనల్‌ మెట్టుపై చతికిలబడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. విండీస్‌ గడ్డపై రోహిత్‌ బృందం సఫారీ జట్టును ఓడించే టైటిల్‌ నెగ్గింది.  ఈ ఏడాది అండర్‌–19 మహిళల టి20 ప్రపంచకప్‌లో తెలంగాణ యువతేజం గొంగడి త్రిష ఆల్‌రౌండ్‌ షోతో భారత జట్టు దక్షిణాఫ్రికాను చిత్తు చేసి టైటిల్‌ను నిలబెట్టుకుంది. 

దీంతో దక్షిణాఫ్రికాపై ‘చోకర్స్‌’ ముద్ర మరింత బలంగా పడింది. అయితే ముద్రను తమ జట్టు త్వరలోనే చెరిపేస్తుందని మాజీ కెప్టెన్‌ స్మిత్‌ అన్నాడు. ఇప్పుడు క్రికెట్‌లో ఏదీ అంత సులువుగా రాదని, దేనికైనా పోరాడాల్సిందేనని చెప్పుకొచ్చాడు. టి20లకు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పెరుగుతోందని, ఆలాగే సంప్రదాయ టెస్టు ప్రభ కోల్పోకూడదనుకుంటే... కనీసం 6, 7 జట్లు గట్టి ప్రత్యర్థులుగా ఎదగాల్సి ఉంటుందన్నాడు. అప్పుడే పోటీ పెరిగి టెస్టులూ ఆసక్తికరంగా సాగుతాయన్నాడు.   

Videos

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)