రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన టీమిండియా క్రికెటర్‌..

Published on Fri, 08/22/2025 - 11:56

భార‌త మ‌హిళా జ‌ట్టు స్పిన్న‌ర్‌, హైద‌రాబాదీ గౌహెర్ సుల్తానా గురువారం అన్ని రకాల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించింది. వ‌న్డే, టీ20ల్లో భార‌త జ‌ట్టుకు ప్రాతినిథ్యం వ‌హించిన సుల్తానా త‌న 17 ఏళ్ల కెరీర్‌కు ముగింపు ప‌లికింది. సుల్తానా 2008లో టీమిండియా త‌ర‌పున అంత‌ర్జాతీయ అరంగేట్రం చేసింది.

ఈ హైద‌రాబాదీ క్రికెట‌ర్ చివ‌ర‌గా భార‌త్ త‌ర‌పున‌ 2014లో పాకిస్తాన్‌పై ఆడింది. గౌహెర్ మొత్తంగా త‌న కెరీర్‌లో 87 మ్యాచ్‌లు ఆడి 95 వికెట్లు ప‌డ‌గొట్టింది. "చాలా సంవ‌త్స‌రాల పాటు భార‌త జెర్సీని ధ‌రించినందుకు గర్వంగా ఉంది. అయితే నా క్రికెట్ ప్రయాణాన్ని ముగించేందుకు సమయం అసన్నమైంది. 

అన్ని రకాల ఫార్మాట్ల నుంచి తప్పుకొవాలని నిర్ణయించుకున్నాను. నా ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో మరుపురాని జ్ఞాపకాలు ఉన్నాయి. నాకు మద్దతుగా నిలిచిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. క్రికెట్ ఎల్లప్పుడూ నా మనసుకు దగ్గరగా ఉంటుం‍ది. 

ఒక ప్లేయర్‌గా నా కెరీర్‌కు తెరపడినా.. క్రికెట్ పట్ల నాకున్న ప్రేమ ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. నన్ను ఈ స్ధాయికి తీసుకొచ్చిన క్రికెట్‌కు నా సేవలను అందించేందుకు నేను ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటాను. ఇది వీడ్కోలు కాదు. ఇది ఒక సువర్ణ అధ్యాయానికి ముగింపు మాత్రమే అని" అని ఇన్‌స్టాలో సుల్తానా రాసుకొచ్చింది. 

గౌహెర్ సుల్తానా దేశవాళీ క్రికెట్‌లో హైదరాబాద్, పుదుచ్చేరి, రైల్వేస్, బెంగాల్ తరపున ఆడింది. అంతేకాకుండా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ తొలి రెండు సీజన్లలో ఆమె యూపీ వారియ‌ర్స్‌కు ప్రాతినిథ్యం వ‌హించింది.
చదవండి: నా బెస్ట్‌ కెప్టెన్‌ అతడే.. ధోనికి కూడా అంత సులువుగా ఏదీ రాలేదు: ద్రవిడ్‌

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)