Breaking News

భారత్‌, ఆస్ట్రేలియా మూడో వన్డేకు సంబంధించి బిగ్‌ అప్‌డేట్‌

Published on Fri, 10/24/2025 - 20:07

భారత్‌, ఆస్ట్రేలియా (India vs Australia) మధ్య సిడ్నీ వేదికగా రేపు (అక్డోబర్‌ 25) వన్డే మ్యాచ్‌ జరుగనుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరగాల్సిన చివరి మ్యాచ్‌ ఇది. ఈ సిరీస్‌ను ఆస్ట్రేలియా ఇప్పటికే కైవసం చేసుకుంది. ఆ జట్టు తొలి రెండు వన్డేల్లో భారత్‌పై ఏకపక్ష విజయాలు సాధించింది. రేపు జరుగబోయే మ్యాచ్‌ నామమాత్రంగా సాగనుంది.

కాగా, పెర్త్‌ వేదికగా జరిగిన తొలి వన్డేకు వరుణుడు ఆటంకాలు కలిగించిన నేపథ్యంలో రేపు జరుగబోయే మ్యాచ్‌కు కూడా వర్షం ఆటంకం కలిగిస్తుందా అని అభిమానులు ఆరా తీస్తున్నారు. అయితే ఈ విషయంలో వారికి గుడ్‌ న్యూస్‌ అందింది.

Accuweather సమాచారం ప్రకారం, సిడ్నీలో రేపు వర్షం పడే అవకాశం లేదు. మ్యాచ్‌ పూర్తిస్థాయిలో సజావుగా సాగుతుంది. ఉష్ణోగ్రతలు సుమారు 16°C నుంచి 23°C మధ్యలో ఉండే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌కు భారీ స్థాయిలో అభిమానులు హాజరుకానున్నారు. 

క్రికెట్‌ ఆస్ట్రేలియా ఇవాళ మధ్యాహ్నమే సిడ్నీ మైదానం బయట సోల్డ్‌ ఔట్‌ బోర్డులు పెట్టింది. అప్రాధాన్యమైన మ్యాచ్‌ అయినప్పటికీ.. టీమిండియా దిగ్గజాలు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లిని చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. రేపు వీకెండ్‌ కావడంతో ఈ మ్యాచ్‌ను అదనపు ఆదరణ లభించనుంది.

ఇదిలా ఉంటే, ఆస్ట్రేలియా పరంగా రేపటి మ్యాచ్‌ అప్రాధాన్యమైనప్పటికీ టీమిండియాకు మాత్రం చాలా కీలకం. ఎందుకంటే ఇప్పటికే 0-2తో సిరీస్‌ కోల్పోయిన భారత్‌, రేపటి మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి క్లీన్‌ స్వీప్‌ పరాభవాన్ని తప్పించుకోవాలని భావిస్తుంది. ఒకవేళ రేపటి మ్యాచ్‌లో కూడా భారత్‌ ఓడితే వన్డేల్లో ఆస్ట్రేలియా చేతిలో తొలి వైట్‌వాష్‌ పరాభవాన్ని ఎదుర్కొంటుంది.

చదవండి: ప్రపంచకప్‌ నుంచి తప్పుకొన్న పాకిస్తాన్‌

రేపటి మ్యాచ్‌ తర్వాత భారత్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య టీ20 సిరీస్‌ మొదలవుతుంది. ఈ సిరీస్‌ కోసం భారత టీ20 జట్టు ఇదివరకే ఆసీస్‌ గడ్డపై ల్యాండ్‌ అయ్యింది. భారత వన్డే జట్టులో కొందరు మాత్రమే టీ20 జట్టులో ఉన్నారు. సీనియర్లు విరాట్‌, రోహిత్‌, కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌ వన్డే సిరీస్‌ తర్వాత భారత్‌కు బయల్దేరిపోతారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)