Breaking News

IND vs AFG: టీమిండియా స్టార్‌ వచ్చేస్తున్నాడు!

Published on Fri, 06/19/2026 - 19:06

అఫ్గానిస్తాన్‌తో మూడో వన్డేకు ముందు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) శుభవార్త చెప్పింది. ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి పూర్తిగా కోలుకున్నట్లు తెలిపింది. అఫ్గాన్‌తో నామమాత్రపు మ్యాచ్‌కు అతడు అందుబాటులో ఉండనున్నట్లు వెల్లడించింది.

సిరీస్‌ కైవసం
కాగా టీమిండియా ప్రస్తుతం సొంతగడ్డ మీద అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్‌ ఆడుతున్న సంగతి తెలిసిందే. ధర్మశాలలో జరిగిన తొలి వన్డేలో ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించిన గిల్‌ సేన.. లక్నో వేదికగా రెండో వన్డేలో ప్రత్యర్థిని ఏకంగా 170 పరుగుల తేడాతో చిత్తు చేసింది.

రెండో వన్డేకు దూరం
తద్వారా మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంది టీమిండియా. ఇక తొలి వన్డే ఆడిన పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ నితీశ్‌ రెడ్డి (Nitish Kumar Reddy).. ఆ మ్యాచ్‌ సందర్భంగా తొడ కండరాల నొప్పితో బాధపడ్డాడు. ఫలితంగా రెండో వన్డేకు దూరమయ్యాడు. అయితే, తాజాగా నితీశ్‌ రెడ్డి గాయం గురించి బీసీసీఐ అప్‌డేట్‌ ఇచ్చింది.

సెలక్షన్‌కు అందుబాటులో ఉన్నాడు
ఈ విషయం గురించి టీమిండియా అసిస్టెంట్‌ కోచ్‌ ర్యాన్‌ టెన్‌ డష్కాటే పీటీఐతో మాట్లాడుతూ.. ‘‘నితీశ్‌ రెడ్డి బాగానే ఉన్నాడు. కోలుకున్నాడు. రేపటి మ్యాచ్‌ ఆడేందుకు అతడు సిద్ధంగానే ఉన్నాడు’’ అని తెలిపాడు. 

కాగా టీమిండియా ఇప్పటికే సిరీస్‌ గెలిచింది. కాబట్టి నితీశ్‌ రెడ్డి విషయంలో మేనేజ్‌మెంట్‌ రిస్క్‌ తీసుకుంటుందా?.. లేదంటే విశ్రాంతినిస్తుందానేది శనివారం తేలనుంది. కాగా భారత్‌- అఫ్గానిస్తాన్‌ మధ్య మూడో వన్డేకు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదిక.

చదవండి: IND vs AFG: మూడో వన్డే.. భారత తుదిజట్టు ఇదే!

Videos

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

నాగబాబు వల్ల జనసేన నాశనం... రాజీనామా తరువాత గూడూరు వెంకటేశ్వర రావు సంచలన కామెంట్స్

Photos

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)