Breaking News

దీపిక ధమాకా

Published on Mon, 06/28/2021 - 03:43

పారిస్‌: టోక్యో ఒలింపిక్స్‌కు ముందు పాల్గొంటున్న చివరి టోర్నమెంట్‌లో భారత మహిళా మేటి ఆర్చర్‌ దీపిక కుమారి అదరగొట్టింది. ఆదివారం ముగిసిన ప్రపంచకప్‌ స్టేజ్‌–3 టోర్నమెంట్‌లో దీపిక ఏకంగా మూడు స్వర్ణ పతకాలు సొంతం చేసుకొని సంచలనం సృష్టించింది. ఐదు గంటల వ్యవధిలో దీపిక నాలుగు మ్యాచ్‌లు ఆడి అన్నింటా విజయం సాధించింది. ముందుగా తన భాగస్వాములు అంకిత భకత్, కోమలిక బరిలతో కలిసి మహిళల రికర్వ్‌ టీమ్‌ విభాగంలో పసిడి పతకం దక్కించుకున్న 27 ఏళ్ల దీపిక మిక్స్‌డ్‌ విభాగంలో తన భర్త అతాను దాస్‌తో కలిసి విజేతగా నిలిచింది. అనంతరం వ్యక్తిగత రికర్వ్‌ విభాగంలోనూ దీపిక అద్భుతంగా రాణించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.  తద్వారా ఒకే ప్రపంచకప్‌ టోర్నీలో మూడు స్వర్ణాలు సాధించిన తొలి భారత ప్లేయర్‌గా గుర్తింపు పొందింది.

అనా వాజ్‌క్వెజ్, ఐదా రోమన్, వలెన్సియాలతో కూడిన మెక్సికో మహిళల జట్టుతో జరిగిన రికర్వ్‌ టీమ్‌ ఫైనల్లో భారత బృందం 5–1తో నెగ్గింది. ఏప్రిల్‌లో గ్వాటెమాలా సిటీలో జరిగిన ప్రపంచకప్‌ స్టేజ్‌–1 టోర్నీలోనూ దీపిక, అంకిత, కోమలిక బృందం స్వర్ణ పతకాన్ని గెల్చుకోవడం విశేషం.రికర్వ్‌ మిక్స్‌డ్‌ ఫైనల్లో దీపిక కుమారి–అతాను దాస్‌ జంట 5–3తో గ్యాబీ ష్కాలెసర్‌–ఎస్జెఫ్‌ వాన్‌ డెన్‌ బెర్గ్‌ (నెదర్లాండ్స్‌) జోడీని ఓడించింది.  మహిళల రికర్వ్‌ వ్యక్తిగత ఫైనల్లో దీపిక 6–0తో ఎలెనా ఒసిపోవా (రష్యా)పై గెలిచి విజేతగా నిలిచింది. దీపిక వరుసగా మూడు సెట్‌లు (29–26; 29–28; 28–27) గెలిచి ప్రత్యర్థికి తేరుకునే అవకాశమే ఇవ్వలేదు. సెమీఫైనల్లో దీపిక 6–2తో అనా వాజ్‌క్వెజ్‌ (మెక్సికో)ను ఓడించింది.

మూడు స్వర్ణాలు గెలిచినందుకు చాలా ఆనందంగా ఉంది. మున్ముందూ ఇదే తరహాలో నా ప్రదర్శన ఉండాలి. ప్రపంచకప్‌ టోర్నీలకు దూరంగా ఉన్న కొరియా, చైనా, జపాన్, చైనీస్‌ తైపీ క్రీడాకారిణుల నుంచి టోక్యో ఒలింపిక్స్‌లో తీవ్రమైన పోటీ ఉంటుంది. నా ఆటలోని లోపాలను సరిదిద్దుకుంటూ టోక్యోలో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు కృషి చేస్తా.          
– దీపిక కుమారి

భార్యభర్తలు అతాను, దీపిక స్వర్ణ చుంబనం

Videos

మహిళల సింధూరాన్ని చెరిపినవారిని మట్టిలో కలిపేశాం : మోదీ

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

Photos

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)