Breaking News

Ind vs Eng: తిరిగి వెళ్లమన్న సెలక్టర్లు.. పాటిదార్‌పై వేటు?

Published on Wed, 02/28/2024 - 15:29

'Go back and play Ranji...': BCCI wants To: ఇంగ్లండ్‌తో నామమాత్రపు ఐదో టెస్టులో టీమిండియా పలు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సిరీస్‌ సందర్భంగా నలుగురు యువ ఆటగాళ్లు అరంగేట్రం చేయగా.. మరో ఆటగాడికీ ఛాన్స్‌ ఇచ్చేందుకు బీసీసీఐ సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

అదే విధంగా ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా తిరిగి జట్టుతో చేరనున్నట్లు తెలుస్తోంది. కాగా స్వదేశంలో స్టోక్స్‌ బృందంతో టెస్టు సిరీస్‌ను రోహిత్‌ సేన ఇప్పటికే 3-1తో కైవసం చేసుకుంది. హైదరాబాద్‌లో ఆరంభ మ్యాచ్‌లో ఓడినా.. విశాఖపట్నం, రాజ్‌కోట్‌, రాంచిలలో హ్యాట్రిక్‌ విజయాలు నమోదు చేసి సొంతగడ్డపై ఈ మేరకు ఆధిపత్యాన్ని చాటుకుంది.

ఇక విశాఖ టెస్టులో మధ్యప్రదేశ్‌ ఆటగాడు రజత్‌ పాటిదార్‌.. రాజ్‌కోట్‌లో ముంబై బ్యాటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌, వికెట్‌ కీపర్‌ ధ్రువ్‌ జురెల్‌.. రాంచిలో బెంగాల్‌ పేసర్‌ ఆకాశ్‌ దీప్‌ టీమిండియా క్యాపులు అందుకున్నారు. వీరిలో రజత్‌ పాటిదార్‌కు వరుసగా మూడుసార్లు అవకాశాలు ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయాడు.

ఈ సిరీస్‌లో అతడు చేసిన పరుగులు 32,9,5,0,17,0. ఫలితంగా రజత్‌ పాటిదార్‌ వైఫల్యాలపై విమర్శలు వెల్లువెత్తాయి. ఫామ్‌లో లేని ఆటగాడిని జట్టులో కొనసాగించడం ఏమిటనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఐదో టెస్టు నుంచి పాటిదార్‌ను తప్పించాలని మేనేజ్‌మెంట్‌ భావిస్తున్నట్లు సమాచారం.

రంజీ ట్రోఫీ 2023-24లో విదర్భతో మధ్యప్రదేశ్‌ సెమీ ఫైనల్లో ఆడాల్సిందిగా బీసీసీఐ తొలుత ఆదేశించినట్లు తెలుస్తోంది. అయితే, కేఎల్‌ రాహుల్‌ ఫిట్‌నెస్‌ గురించి స్పష్టత రాకపోవడంతో పాటిదార్‌ విషయంలో నిర్ణయం మార్చుకున్నట్లు సమాచారం.

అయితే, రాహుల్‌ రాకపోయినా పాటిదార్‌ను తుదిజట్టు నుంచి తప్పించి.. అతడి స్థానంలో దేవ్‌దత్‌ పడిక్కల్‌ను ఆడించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అదనపు బ్యాటర్‌గా అతడిని జట్టుతోనే కొనసాగించాలనుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా కర్ణాటక బ్యాటర్‌ తాజా రంజీ సీజన్‌లో వరుస శతకాలతో ఆకట్టుకున్నాడు. భారత్‌-ఏ తరఫున కూడా రాణించాడు.

చదవండి: Rohit Sharma: ఆ మాత్రం విశ్వాసం లేకపోతే ఎట్లా? 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)