డస్సెన్‌, మున్రో సిక్సర్ల వర్షం

Published on Fri, 07/26/2024 - 07:25

గ్లోబల్‌ టీ20 కెనడా టోర్నీలో టొరంటో నేషనల్స్‌ బోణీ కొట్టింది. నిన్న (జులై 25) జరిగిన టోర్నీ ఓపెనర్‌లో వాంకోవర్‌ నైట్స్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన వాంకోవర్‌.. జునైద్‌ సిద్దిఖీ (3.3-0-24-4), రోహిద్‌ ఖాన్‌ (4-0-29-2), సాద్‌ బిన్‌ జాఫర్‌ (4-0-11-2), బెహ్రెన్‌డార్ఫ్‌ (4-0-20-1) ధాటికి 19.3 ఓవర్లలో 110 పరుగులకు ఆలౌటైంది. 

వాంకోవర్‌ ఇన్నింగ్స్‌లో రీజా హెండ్రిక్స్‌ (23), మునీర్‌ అహ్మద్‌ (22) మాత్రమే అతి కష్టం మీద 20 పరుగుల మార్కును దాట గలిగారు. కెప్టెన్‌ ఉస్మాన్‌ ఖ్వాజా 3, హర్ష్‌ థాకెర్‌ 0, నితీశ్‌ కుమార్‌ 0, ప్రిటోరియస్‌ 16, రిప్పన్‌ 1, సందీప్‌ లామిచ్చేన్‌ 15, ఆమిర్‌ 0, వాన్‌ మీకెరెన్‌ 12 పరుగులు చేసి ఔటయ్యారు. 

అనంతరం​ స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టొరొంటో.. కొలిన్‌ మున్రో (44; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), వాన్‌ డెర్‌ డస్సెన్‌ (31 నాటౌట్‌; ఫోర్‌, 3 సిక్సర్లు) చెలరేగడంతో 14.4 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఉన్ముక్త్‌ చంద్‌ 23 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. వాంకోవర్‌ బౌలర్లలో వాన్‌ మీకెరెన్‌, సందీప్‌ లామిచ్చేన్‌ తలో వికెట్‌ పడగొట్టారు. ఇవాళ జరుగబోయే మ్యాచ్‌లో మాంట్రియల్‌ టైగర్స్‌, బంగ్లా టైగర్స్‌ పోటీ పడతాయి. 

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)