Breaking News

బంగ్లాదేశ్‌పై న్యూజిలాండ్‌ విజయం.. సిరీస్‌ సమం

Published on Sat, 12/09/2023 - 15:41

మిర్పూర్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ విజయం సాధించింది. తద్వారా రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో కివీస్‌ సమం చేసింది. 137 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. బ్లాక్‌ కాప్స్‌ విజయంలో గ్లెన్‌ ఫిలిప్స్‌(40 నాటౌట్‌), మిచెల్‌ శాంట్నర్‌(35) కీలక పాత్ర పోషించారు. బ్యాటింగ్‌కు కష్టంగా ఉన్న వికెట్‌పై ఫిలిప్స్‌, శాంట్నర్‌ అద్బుతంగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు.

బంగ్లా బౌలర్లలో మెహది హసన్‌ మిరాజ్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. తైజుల్‌ ఇస్లాం రెండు, షోర్‌ఫుల్‌ ఇస్లాం​ ఒక వికెట్‌ సాధించారు. అంతకుముందు 38/2 ఓవర్‌ నైట్‌ స్కోర్‌తో ఐదో రోజు ఆటను ప్రారంభించిన బంగ్లాదేశ్‌  144 పరుగులకే కుప్పకూలింది.

కివీస్‌ బౌలర్లలో స్పిన్నర్‌ ఆజాజ్ పటేల్ 6 వికెట్లతో బంగ్లాపతనాన్ని శాసించాడు. అతడితో పాటు శాంట్నర్‌ 3 వికెట్లు సాధించాడు. కాగా కివీస్‌ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 37.1 ఓవర్లో 180 పరుగులకు ఆలౌటైంది.   కివీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో కూడా గ్లెన్‌ ఫిలిప్స్‌ 87 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

Videos

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)