న్యూజిలాండ్‌ను కాపాడిన గ్లెన్ ఫిలిప్స్‌

Published on Thu, 06/18/2026 - 19:01

లండ‌న్ వేదిక‌గా ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్‌ను ఆల్‌రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ అద్భుత సెంచరీతో ఆదుకున్నాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ తొలుత కివీస్‌ను బ్యాటింగ్ అహ్హానించాడు. అయితే బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై న్యూజిలాండ్ 188 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

ఈ సమయంలో గ్లెన్ ఫిలిప్స్, వికెట్ కీపర్ బ్యాటర్‌ టామ్ బ్లండెల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. అయితే తొలి రోజు ఆట ముగుస్తుందన్న సమయంలో కివీస్ వరుస క్రమంలో రెండు వికెట్లు కోల్పోయింది. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాక బ్లండెల్ జాకబ్ బెథెల్ బౌలింగ్‌లో అవుట్ కాగా.. ఆ తర్వాత నాథన్ స్మిత్ కూడా తక్కువ పరుగులకే వెనుదిరిగాడు. 

280 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన దశలో న్యూజిలాండ్ కనీసం 350 పరుగులైనా చేస్తుందా అనే అనుమానం కలిగింది. అయితే రెండో రోజు ఆటలో మాత్రం ఫిలిప్స్ దూకుడుగా ఆడాడు.  ఈ క్రమంలో 133 బంతుల్లో ఫిలిప్స్ తొలి టెస్ట్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.

అతడు సరిగ్గా 100 పరుగులు చేసి పదో వికెట్‌గా వెనుదిరిగాడు. అయితే రెండో రోజు ఆటలో ఫిలిప్స్‌కు  కైల్ జేమీసన్ (41) కూడా  మంచి సహకారం అందించాడు. వీరిద్దరూ కలిసి 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఫలితంగా న్యూజిలాండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 391 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌ బౌలర్లలో పార్ట్‌ టైమ్‌ స్పిన్నర్‌ జాకబ్‌ బెతల్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. జోఫ్రా ఆర్చర్‌,  మాథ్యూ ఫిషర్‌, బాకర్‌ తలా రెండేసి వికెట్లు చొప్పున సాధించారు.
చదవండి: Gurnoor Brar: టీమిండియాకు దొరికిన 'ఆరడుగుల' బుల్లెట్‌

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)