మెరుపు అర్ద శతకం.. మ్యాక్స్‌వెల్‌ ఖాతాలో భారీ రికార్డు

Published on Thu, 01/09/2025 - 17:20

బిగ్‌బాష్‌ లీగ్‌లో మెల్‌బోర్న్‌ స్టార్స్‌ ఆటగాడు గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ ఓ భారీ రికార్డును సాధించాడు. లీగ్‌ చరిత్రలో 3000 పరుగుల మార్కును దాటిన ఆరో ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. బీబీఎల్‌ 2024-25లో భాగంగా సిడ్నీ సిక్సర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మ్యాక్సీ ఈ అరుదైన ఘనత సాధించాడు. 

మ్యాక్సీకి ముందు క్రిస్‌ లిన్‌, ఆరోన్‌ ఫించ్‌, డిఆర్కీ షార్ట్‌, మోసెస్‌ హెన్రిక్స్‌, జాన్‌ వెల్స్‌ మాత్రమే బీబీఎల్‌లో 3000 పరుగుల మైలురాయిని తాకారు. సిడ్నీ సిక్సర్స్‌తో మ్యాచ్‌లో మెరుపు అర్ద శతకం బాదిన మ్యాక్సీ.. బీబీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో వెల్స్‌, హెన్రిక్స్‌లను అధిగమించాడు.

బిగ్‌బాష్‌ లీగ్‌లో అత్యధిక పరుగులు చేసిన టాప్‌-5 బ్యాటర్స్‌..
క్రిస్‌ లిన్‌-3908
ఆరోన్‌ ఫించ్‌-3311
డిఆర్కీ షార్ట్‌-3102
గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌-3047
మోసెస్‌ హెన్రిక్స్‌-3035

మ్యాక్సీ మెరుపు అర్ద శతకం
సిడ్నీ సిక్సర్స్‌తో మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్‌ మెరుపు అర్ద శతకం సాధించాడు. ఈ మ్యాచ్‌లో అతను 32 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అజేయమైన 58 పరుగులు చేశాడు. ఫలితంగా మెల్‌బోర్న్‌ స్టార్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. 

మెల్‌బోర్న్‌ ఇన్నింగ్స్‌లో బ్యూ వెబ్‌స్టర్‌ (48) ఓ మోస్తరు స్కోర్‌ చేయగా.. బెన్‌ డకెట్‌ (20), డాన్‌ లారెన్స్‌ (14) రెండంకెల స్కోర్లు చేశారు. సామ్‌ హార్పర్‌ (4), కెప్టెన్‌ మార్కస్‌ స్టోయినిస్‌ (4) విఫలమయ్యారు. సిక్సర్స్‌ బౌలర్లలో సీన్‌ అబాట్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. జాక్‌ ఎడ్వర్డ్స్‌, హేడెన్‌ కెర్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు.

19వ హాఫ్‌ సెంచరీ
ఈ మ్యాచ్‌లో మ్యాక్సీ చేసిన హాఫ్‌ సెంచరీ బీబీఎల్‌లో అతనికి 19వది. ఓవరాల్‌గా అతను టీ20ల్లో 55 అర్ద శతకాలు సాధించాడు. టీ20 కెరీర్‌లో 427 మ్యాచ్‌లు ఆడిన మ్యాక్స్‌వెల్‌ 154 స్ట్రయిక్‌రేట్‌తో 28 సగటున 10,183 పరుగులు చేశాడు. ఇందులో ఏడు సెంచరీలు ఉన్నాయి. ఆసీస్‌ తరఫున 133 అంతర్జాతీయ టీ20లు ఆడిన మ్యాక్సీ ఐదు సెంచరీల సాయంతో 2664 పరుగులు చేశాడు. టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మ్యాక్స్‌వెల్‌ 16వ స్థానంలో ఉన్నాడు.

చిత్తుగా ఓడిన సిక్సర్స్‌
157 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సిడ్నీ సిక్సర్స్‌ నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి లక్ష్యానికి 17 పరుగుల దూరంలో నిలిచిపోయింది. మార్క్‌ స్టీకిటీ (3/14), పీటర్‌ సిడిల్‌ (2/26), మార్కస్‌ స్టోయినిస్‌ (2/30), ఉసామా మిర్‌ (2/19) పొదుపుగా బౌలింగ్‌ చేయడంతో పాటు వికెట్లు తీసి మెల్‌బోర్న్‌ స్టార్స్‌ను గెలిపించారు. సిక్సర్స్‌ ఇన్నింగ్స్‌లో జేమ్స్‌ విన్స్‌ (53) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. మిగిలిన ఆటగాళ్లంతా విఫలమయ్యారు. కర్టిస్‌ ప్యాటర్సన్‌ (18), హేడెన్‌ కెర్‌ (21), మోసెస్‌ హెన్రిక్స్‌ (13) రెండంకెల స్కోర్లు చేశారు.  

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)