Breaking News

మ్యాక్స్‌వెల్‌కు బంపరాఫర్‌.. హైదరాబాద్‌ ఫ్రాంచైజీతో ఒప్పందం

Published on Fri, 02/20/2026 - 15:02

ఆస్ట్రేలియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌లో తొలిసారి కనిపించబోతున్నాడు. ఆ లీగ్‌లో కొత్త ఫ్రాంచైజీ 'హైదరాబాద్‌ హ్యూస్టన్‌ కింగ్స్‌మన్‌ బోల్‌స్టర్‌' 2026 ఎడిషన్‌ కోసం మ్యాక్సీతో ఒప్పందం చేసుకుంది. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ యాజమాన్యం అధికారికంగా వెల్లడించింది.

తమతో జతకట్టిన సందర్భంగా హైదరాబాద్‌ ఫ్రాంచైజీ మ్యాక్స్‌వెల్‌పై ప్రశంసల వర్షం కురిపించింది. ఇంగ్లీష్‌లో పెద్దపెద్ద పదాలు (విధ్వంసకర బ్యాటింగ్‌కు సంబంధించి) ఉపయోగించి ఆకాశానికెత్తింది. అసాధ్యం అనే పదం మ్యాక్సీ నిఘంటువులో లేదు. అతని ప్రవేశంతో పీఎస్‌ఎల్‌లో అతిపెద్ద షో మొదలవుతోందంటూ తమ సోషల్‌మీడియా అకౌంట్‌లో డప్పు కొట్టింది.

వాస్తవానికి సదరు ఫ్రాంచైజీ ఇస్తున్న హైప్‌కు ప్రస్తుత మ్యాక్సీ ఫామ్‌కు అస్సలు పొంతన లేదు. మ్యాక్స్‌వెల్‌ ఇటీవలికాలంలో కెరీర్‌లో ఎన్నడూ లేని దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. 

ప్రస్తుతం టీ20 ప్రపంచకప్‌ ఆడుతున్న అతను.. అక్కడ కూడా పేలవమైన ప్రదర్శనలు కొనసాగించాడు. ఈ మెగా టోర్నీ నుంచి ఆస్ట్రేలియా గ్రూప్‌ దశలోనే నిష్క్రమించింది. జట్టు పరంగా, వ్యక్తిగతంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న తరుణంలో మ్యాక్స్‌వెల్‌కు హైదరాబాద్‌ ఫ్రాంచైజీ బంపరాఫర్‌ ఇచ్చింది.

ఐపీఎల్‌లో పట్టించుకునే నాథుడే లేడు
ఎటూ ఏ ఫ్రాంచైజీ ఎంపిక చేసుకునే ఆవకాశం లేకపోవడంతో మ్యాక్స్‌వెల్‌ ఐపీఎల్‌ 2026 వేలంలో పాల్గొనలేదు. గత కొన్ని ఎడిషన్లుగా అతను ఐపీఎల్‌లో దారుణంగా విఫలమయ్యాడు. ఎన్ని ఫ్రాంచైజీలు మారినా అదే పరిస్థితి. 

పేలవ ఫామ్‌, వయసు మీద పడటంతో అంతర్జాతీయ క్రికెట్‌లో మ్యాక్స్‌వెల్‌ శకం  ముగిసిందని ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ ఇటీవల వ్యాఖ్యానించాడు. కెరీర్‌లో అత్యంత దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్న మ్యాక్సీ.. పీఎస్‌ఎల్‌లోనైనా రాణిస్తాడో లేక కెరీర్‌కు ముగింపు పలుకుతాడో వేచి చూడాలి. కాగా, పీఎస్‌ఎల్‌ 2026 ఎడిషన్‌ మార్చి 26 నుంచి మే 3 వరకు జరుగుతుంది. 

Videos

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)