విధ్వంసకర శతకం.. గేల్‌, కోహ్లి సెంచరీల క్లబ్‌లో చేరిన మ్యాక్స్‌వెల్‌

Published on Wed, 06/18/2025 - 13:08

మేజర్‌ లీగ్‌ క్రికెట్‌ 2025 ఎడిషన్‌లో భాగంగా లాస్‌ ఏంజెలెస్‌ నైట్‌రైడర్స్‌తో ఇవాళ (జూన్‌ 18) జరిగిన మ్యాచ్‌లో వాషింగ్టన్‌ ఫ్రీడం కెప్టెన్‌, ఆసీస్‌ విధ్వంసకర బ్యాటర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ సుడిగాలి శతకంతో విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్‌లో మ్యాక్సీ కేవలం 49 బంతుల్లో 13 సిక్సర్లు, 2 ఫోర్ల సాయంతో అజేయమైన 106 పరుగులు చేశాడు. ఈ సెంచరీకి మ్యాక్స్‌వెల్‌కు టీ20ల్లో ఎనిదవది.

ఈ సెంచరీతో మ్యాక్స్‌వెల్‌ క్రిస్‌ గేల్‌, విరాట్‌ కోహ్లి టీ20 సెంచరీల క్లబ్‌లో చేరాడు. పొట్టి క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు బాదిన ఆటగాళ్ల జాబితాలో 10వ స్థానానికి దూసుకొచ్చాడు. పొట్టి క్రికెట్‌లో అత్యధిక సెంచరీల రికార్డు యూనివర్సల్‌ బాస్‌ క్రిస్‌ గేల్‌ పేరిట ఉంది. ఈ ఫార్మాట్‌లో గేల్‌ 22 శతకాలు బాదాడు. 

గేల్‌ తర్వాత ఈ రికార్డు పాక్‌ స్టార్‌ ఆటగాడు బాబర్‌ ఆజమ్‌ (11) పేరిట ఉంది. ఈ ఫార్మాట్‌లో టీమిండియా స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి 9 సెంచరీలు బాదాడు. తాజా సెంచరీతో మ్యాక్స్‌వెల్‌ మైఖేల్‌ క్లింగర్‌, ఆరోన్‌ ఫించ్‌, డేవిడ్‌ వార్నర్‌, జోస్‌ బట్లర్‌, రోహిత్‌ శర్మ సరసన చేరాడు. వీరంతా పొట్టి ​క్రికెట్‌లో తలో ఎనిమిది సెంచరీలు బాదారు.

పొట్టి క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు బాదిన టాప్‌-10 క్రికెటర్లు..
గేల్‌-22
బాబర్‌ ఆజమ్‌-11
విరాట్‌ కోహ్లి-9
రిలీ రొస్సో-9
మైఖేల్‌ క్లింగర్‌-8
ఆరోన్‌ ఫించ్‌-8
డేవిడ్‌ వార్నర్‌-8
జోస్‌ బట్లర్‌-8
రోహిత్‌ శర్మ-8
మ్యాక్స్‌వెల్‌-8

మ్యాచ్‌ విషయానికొస్తే.. మ్యాక్స్‌వెల్‌ విధ్వంసకర శతకంతో విరుచుకుపడటంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన వాషింగ్టన్‌ ఫ్రీడం నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు (68/4) బరిలోకి దిగిన మ్యాక్సీ తొలుత నిదానంగా ఆడాడు. తొలి 15 బంతుల్లో కేవలం 11 పరుగులు మాత్రమే చేశాడు. ఆతర్వాత మ్యాక్సీకి పూనకం వచ్చింది. 34 బంతుల్లో 13 సిక్సర్లు, 2 ఫోర్ల సాయంతో 95 పరుగులు చేశాడు. 

ఒబస్‌ పియెనార్‌ను (15 బంతుల్లో 11 నాటౌట్‌) మరో ఎండ్‌లో పెట్టుకొని మ్యాక్సీ తన విధ్వంసకాండను కొనసాగించాడు. వాషింగ్టన్‌ ఇన్నింగ్స్‌లో మ్యాక్సీ మినహా మిచెల్‌ ఓవెన్‌ ఒక్కడే (11 బంతుల్లో 32) కాస్త పర్వాలేదనిపించాడు. రచిన్‌ రవీంద్ర 8, ఆండ్రియస్‌ గౌస్‌ 12, మార్క్‌ చాప్‌మన్‌ 17, జాక్‌ ఎడ్వర్డ్స్‌ 11 పరుగులు చేశాడు. నైట్‌రైడర్స్‌ బౌలర్లలో కోర్నె డ్రై, తన్వీర్‌ సంఘా తలో 2 వికెట్లు పడగొట్టగా.. జేసన్‌ హోల్డర్‌ ఓ వికెట్‌ తీశాడు.

అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన నైట్‌రైడర్స్‌ 16.3 ఓవర్లలో 95 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. జాక్‌ ఎడ్వర్డ్స్‌, మిచెల్‌ ఓవెన్‌ తలో 3, సౌరభ్‌ నేత్రవల్కర్‌ 2, మార్క్‌ అడైర్‌, ఇయాన్‌ హోలండ్‌ చెరో వికెట్‌ పడగొట్టి నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. 

నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌లో సైఫ్‌ బదార్‌ (32), జేసన్‌ హోల్డర్‌ (23), షాడ్లే (12), కోర్నె డ్రై (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ఈ జట్టులో తొలి ముగ్గురు బ్యాటర్లు అలెక్స్‌ హేల్స్‌, సునీల్‌ నరైన్‌, ఉన్ముక్త్‌ చంద్‌ డకౌట్ కాగా.. రోవ్‌మన్‌ పావెల్‌ (4), మాథ్యూ ట్రంప్‌ (2), ఆండ్రీ రసెల్‌ (4) సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే టపా కట్టేశారు. సూపర్‌ సెంచరీ చేసిన మ్యాక్స్‌వెల్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. 

Videos

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)