Breaking News

తండ్రి కాబోతున్న మ్యాక్స్‌వెల్.. 'రెయిన్‌బో బేబీ' జన్మించబోతోందంటూ..

Published on Fri, 05/12/2023 - 11:17

ఆస్ట్రేలియా స్టార్‌ ఆల్‌రౌండర్‌, ఆర్సీబీ కీలక ఆటగాడు గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ తండ్రి కాబోతున్నాడు. ఈ విషయాన్ని అతడి భార్య వినీ రామన్‌ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది. స్కానింగ్‌ రిపోర్ట్‌తో పాటు చిన్నారి డ్రెస్‌ ఫోటోను వినీ రామన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది.

కాగా గతేడాది చెన్నైకి చెందిన వినీ రామన్‌ను హిందూ సంప్రదాయంలో మాక్సీ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఐపీఎల్‌-2023లో ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహిస్తున్న మ్యాక్స్‌వెల్‌ ప్రస్తుతం బీజీబీజీగా ఉన్నాడు.  వినీ రామన్‌ కూడా తన భర్తతో పాటు ఇండియాలోనే ఉంది.

"మాక్సీ, నేను మా రెయిన్‌బో బేబీకి ఈ ఏడాది  సెప్టెంబర్‌లో జన్మనివ్వనున్నాం. ఈ విషయాన్ని తెలియజేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మా ఈ ప్రయాణం అంత తేలికగా సాగలేదు. ఇలాంటి సమయం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసేవాళ్లు ఇటువంటి పోస్టులు చూసి ఎంత బాధపడతారో నాకు బాగా తెలుసు. ఆ బాధను మేము అనుభవించాం. సంతాన‌లేమితో బాధ‌ప‌డుతున్న జంట‌ల‌కు మా ప్రేమను తెలియ‌జేస్తున్నాం" అని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో వినీ రమన్‌ రాసుకొచ్చింది.

రెయిన్‌బో బేబీ అంటే?
ఈ మధ్య కాలంలో రెయిన్‌బో బేబీ అనే పదం తరచుగా వింటూ ఉన్నాం. అస్సలు ఈ రెయిన్‌బో బేబీ అంటే ఎంటో తెలుసుకుందాం. గర్భస్రావం లేదా ఇతర కారణాలతో త‌ల్లి క‌డుపులోనే బేబీ చ‌నిపోయిన త‌ర్వాత పుట్టబోయే బిడ్డను రెయిన్‌బో బేబీ అని అంటారు.
చదవండి: #Yashasvi Jaiswal: వాట్‌ ఏ టాలెంట్‌.. నేను చూసిన బెస్ట్‌ బ్యాటింగ్‌ ఇదే: విరాట్‌ కోహ్లి

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)