నువ్వు అతడిని నమ్మాలి గిల్‌.. సిరీస్‌లు గెలవాలంటే..

Published on Thu, 01/01/2026 - 16:29

బ్యాటింగ్‌తో మ్యాచ్‌లు గెలిస్తే.. పటిష్ట బౌలింగ్‌తో సిరీస్‌లు గెలవవచ్చని భారత మాజీ క్రికెటర్‌ రాబిన్‌ ఊతప్ప అన్నాడు. ముఖ్యంగా టెస్టుల్లో టీమిండియా బౌలర్ల సేవలను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని అభిప్రాయపడ్డాడు. కాగా భారత టెస్టు జట్టు సారథిగా ఇంగ్లండ్‌ పర్యటనతో శుబ్‌మన్‌ గిల్‌ తన ప్రయాణం మొదలుపెట్టాడు.

ఇంగ్లండ్‌ గడ్డపై బ్యాటర్‌గా అదరగొట్టిన గిల్‌ (Shubman Gill).. కెప్టెన్‌గా 2-2తో ఆండర్సన్‌- టెండుల్కర్‌ ట్రోఫీ సమం చేశాడు. ఆ తర్వాత స్వదేశంలో అతడి సారథ్యంలో వెస్టిండీస్‌తో సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్‌ చేసిన భారత్‌.. ఇటీవల సౌతాఫ్రికా చేతిలో మాత్రం ఘోర పరాభవం చవిచూసింది. రెండు టెస్టుల సిరీస్‌లో సఫారీలు టీమిండియాను 2-0తో వైట్‌వాష్‌ చేశారు.

అయితే, ఈ సిరీస్‌లో టీమిండియా స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ (Washington Sundar)ను బ్యాటర్‌గానే ఎక్కువగా ఆడించింది మేనేజ్‌మెంట్‌. అతడికి పెద్దగా బౌలింగ్‌ చేసే అవకాశం ఇవ్వలేదు. మరోవైపు.. చైనామన్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ (Kuldeep Yadav) సేవలను వాడుకున్నప్పటికీ స్థాయికి తగ్గట్లు అతడిని ఉపయోగించుకోలేకపోయింది.

నువ్వు అతడిని నమ్మాలి గిల్‌
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌.. వీరిద్దరిని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌.. నువ్వు వాషింగ్టన్‌ సుందర్‌పై మరింతగా నమ్మకం ఉంచాలి. ఇలాంటి ఆటగాళ్లకు బౌలింగ్‌ కూడా మంచినీళ్లప్రాయమే.

తాను అద్భుతంగా బౌలింగ్‌ చేయగలనని వాషీ భావించడం సహజం. అయితే, నువ్వు కూడా అదే నమ్మకంతో ఉండాలి. భారత క్రికెట్‌.. ముఖ్యంగా టెస్టుల్లో అభివృద్ధి చెందాలంటే వాషింగ్టన్‌, కుల్దీప్‌ యాదవ్‌లను వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌లలో ఆడిస్తూ.. కుదిరినన్ని ఎక్కువ ఓవర్లు బౌలింగ్‌ వేయించాలి.

బౌలింగ్‌ పటిష్టంగా ఉంటే..
బ్యాటింగ్‌తో మనం మ్యాచ్‌లు గెలవగలం.. అయితే, బౌలింగ్‌ పటిష్టంగా ఉంటే సిరీస్‌ను కూడా కైవసం చేసుకోగలము. మన బౌలర్లకు తమను తాము నిరూపించుకునే అవకాశం ఇవ్వాలి. కుల్దీప్‌ యాదవ్‌తో కనీసం 20-25 ఓవర్లు వేయించాలి. అతడి సేవలను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలి’’ అని ఊతప్ప.. వాషీ, కుల్దీప్‌ల ప్రాధాన్యాన్ని వివరిస్తూ.. గిల్‌కు సలహాలు ఇచ్చాడు.

కాగా ఇటీవల సౌతాఫ్రికాతో సిరీస్‌లో 0-2తో టెస్టు సిరీస్‌ కోల్పోయిన టీమిండియా.. అనంతరం 2-1తో వన్డే సిరీస్‌ గెలిచింది. ఆ తర్వాత ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది. తదుపరి న్యూజిలాండ్‌తో స్వదేశంలో వన్డే, టీ20 సిరీస్‌లు ఆడనుంది.

చదవండి: వారితో టీమిండియా సెలక్టర్లకు ‘తలనొప్పి’.. మరి పంత్‌, నితీశ్‌ రెడ్డి సంగతి?

Videos

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

Photos

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)